ట్రంప్ ఎజెండాపై వారెన్ బఫెట్ డౌట్స్!

12 Nov, 2016 12:08 IST|Sakshi
వాషింగ్టన్ : అమెరికా అ‍ధ్యక్ష ఎన్నికల్లో ఊహించని భరితంగా విజేతగా నిలిచిన డొనాల్డ్ ట్రంప్ ట్రేడ్ ఎజెండాపై ప్రపంచ కోటీశ్వరుడు వారెన్ బఫెట్ సందేహాలు లేవనెత్తారు. ట్రంప్ ఎఫెక్ట్తో అతలాకుతమైన స్టాక్ మార్కెట్ల పరిస్థితి బలంగానే ఉన్నట్టు అమెరికా ఎన్నికల తర్వాత సీఎన్ఎన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమర్థించారు. కానీ ఆయన ట్రేడ్ ఏజెండా ఎలా ఉంటుందో? అని వ్యాఖ్యానించారు. ముందునుంచి వారెన్ బఫెట్ డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్కు సపోర్టు ఇస్తున్న సంగతి తెలిసిందే. 10, 20, 30 ఏళ్ల గరిష్టానికి స్టాక్ మార్కెట్లు వెళ్తాయని, అది హిల్లరీ అయినా.. ట్రంప్ అయినా పెరుగుతాయని ఎటూ తేల్చని సమాధానం ఇచ్చారు. ట్రంప్ గెలుపుతో మార్కెట్లు కుప్పకూలిన సంగతి తెలిసిందే. 
 
ఊహించని విధంగా ట్రంప్ గెలిచినప్పటికీ, అమెరికాపై ఇంకా ఆశావాదంతోనే ఉన్నారా అని అడిగిన ప్రశ్నలకు, 100 శాతం మార్కెట్ సిస్టమ్ పనిచేస్తుందని తెలిపారు. ఎవరికోసమో ఇది పనిచేయదని, అందరినీ కలుపుకుని స్టాక్ మార్కెట్ సిస్టమ్ పనిచేస్తూ ఉంటుందని వివరించారు. అయితే ట్రంప్ తన ప్రచారంలో లేవనెత్తిన ఎన్ఏఎఫ్టీఏ  రద్దు అవకాశాలు తక్కువగా ఉన్నాయని బఫెట్ పేర్కొన్నారు. హోస్, సెనేట్లలో రెండింట్లోనూ ఆయన వీటి రద్దుపై మద్దతు పొందాల్సి ఉంటుందని స్పష్టంచేశారు.  క్యాంపెయిన్లో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరవని చాలా సందర్భాల్లో వెల్లడైనట్టు పేర్కొన్నారు. చైనా, మెక్సికోల నుంచి వస్తున్న ఉత్పత్తులపై 35 శాతం పన్ను విధింపు ఆలోచన చాలా చెత్తగా ఉందని ఆరోపించారు. డొనాల్డ్ ట్రంప్ మేజర్ వ్యాపారాల్లో దెబ్బతిన్నట్టు మరోసారి గుర్తుచేశారు.  
 
మరిన్ని వార్తలు