ఎయిర్‌ఫోర్స్ చీఫ్.. ఓ యుద్ధవిమానం!

13 Jan, 2017 19:56 IST|Sakshi
ఎయిర్‌ఫోర్స్ చీఫ్.. ఓ యుద్ధవిమానం!
ఆయన భారత వైమానిక దళంలోనే అత్యున్నత అధికారి. విమానాలు నడిపించాల్సిన అవసరం ఆయనకు లేదు. కానీ, మన వైమానిక దళంలో అత్యంత పురాతనమైన విమానాలుగా పేరుపొందిన మిగ్-21 ఫైటర్‌ జెట్ నడిపి చూపించారు. అవును.. భారత వైమానిక దళ ప్రధానాధికారి బీఎస్ ధనోవా స్వయంగా మిగ్-21 నడిపించారు. రాజస్థాన్‌లోని ఉత్తర్‌లాయ్ అనే ప్రాంతంలో ఈ తరహా విమానాన్ని ఆయన నడిపించారు. ఆ ప్రాంతంలో ఆయన మూడు రోజుల పర్యటనలో ఉన్నారు. వైమానిక దళం చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆపరేషనల్ బేస్‌కు ఆయన వెళ్లడం ఇదే మొదటిసారి. 
 
కార్గిల్ యుద్ధ సమయంలో కూడా ధనోవా మిగ్ విమానాలు నడిపించారు. రాత్రిపూట చాలా సార్లు ఆయన ఈ విమానంలో వెళ్లి శత్రువుల మీద విరుచుకుపడ్డారు. దాంతో ఆయన వీరత్వానికి గాను ఆయనకు యుద్ధ సేవా మెడల్ కూడా లభించింది. ధనోవా కంటే ముందు ఎయిర్‌ చీఫ్ మార్షల్స్‌గా పనిచేసిన ఏవై టిప్నిస్, దిల్‌బాగ్‌ సింగ్ కూడా వీటిని నడిపించారు. 
>
మరిన్ని వార్తలు