రూ.23 రీచార్జ్ తో అన్లిమిటెడ్ ఆఫర్

21 Dec, 2016 19:25 IST|Sakshi
రూ.23 రీచార్జ్ తో అన్లిమిటెడ్ ఆఫర్

ముంబై: టెలికాం రంగంలో కొనసాగుతున్న  ప్రైస్ వార్ లోకి తాజాగా మరో టెలికాం ఆపరేటర్ ఎయిర్ సెల్  దూసుకువచ్చింది.  వినియోగదారుల కోసం ప్రత్యేక రీఛార్జ్ పధకాలను బుధవారం లాంచ్  చేసింది.  ఏ నెట్వర్క్ కైనా ఉచిత అపరిమిత కాల్స్ అందించే  సరికొత్త ఆఫర్ ను అందిస్తోంది. రూ. 23లతో మొదలయ్యే  రీచార్జ్ లపై  బంపర్ ఆఫర్లు  ప్రకటించింది.
రూ23,  రీఛార్జ్ పై  వినియోగదారులు ఒక రోజు ఒక చెల్లుబాటుతో  ఏ నెట్ వర్కుకైనా అపరిమిత స్థానిక ,  ఎస్టీడీ కాలింగ్  అవకాశాన్ని అందిస్తున్నట్టు ఎయిర్సెల్ ఒక ప్రకటనలో తెలిపారు.

రూ . 348  రీఛార్జ్   (స్థానిక మరియు ఎస్టీడీ) అంతటా ఉచిత కాల్స్ అపరిమిత కాలింగ్ సౌకర్యంతో పాటూ 500 ఎంబీ 3జీ డేటా  , 4జీ  వినియోగదారులకు 1.5జీబీ 3జీ డేటా ఉచితంగా అందిస్తోంది.వాలిడిటీ 28 రోజులు.

వినియోగదారులను సంతోషపెట్టేందుకు ఉచిత కాలింగ్, డాటా సదుపాయాలతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నామని ఎయిర్సెల్ లిమిటెడ్, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్, అనుపమ్ వాసుదేవ్ తెలిపారు. వినియోగదారులకు ఆహ్లాదం,  కాల్ మరియు డేటా  ప్రయోజనాలు అందించేందుకు , అందుబాటుధరల్లో  ఆన్ లైన్ సదుపాయాన్ని  కల్పించేందుకు  ఈ రెండు పథకాలను లాంచ్ చేసినట్టు  పేర్కొన్నారు.

 

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కలర్స్‌ సంక్రాంతి

‘విధి’ విజయం సాధించాలి

అనుకోని అతిథి!

సినిమా

అప్పుడు మళ్లీ లాక్‌డౌన్‌!

సరోజినీ నాయుడుగా...

వైరసవత్తరమైన సినిమాలు

తెలంగాణలో మరో 27 కరోనా కేసులు

పిల్ల‌ల‌తో క‌లిసి విరాళ‌మిచ్చిన బాలీవుడ్ న‌టి

ప్రేమ‌ప‌క్షులు..ఇప్పుడు ఇంట్లోనే ఆనందంగా