100 నిమిషాల టాక్ టైం ఉచితం..

13 Dec, 2016 14:56 IST|Sakshi
100 నిమిషాల టాక్ టైం ఉచితం..

న్యూఢిల్లీ: ఇటీవల ప్రతిష్మాత్మకంగా ప్రారంభమైన ఎయిర్ టెల్  పేమెంట్ బ్యాంక్  డిజిటల్ చెల్లింపులవైపు శరవేగంగా పరుగులు తీస్తోంది.  ఒక వైపు  ప్రభుత్వం డిజిటల్ లావాదేవీలపై అడుగులు వేస్తోంటే మరోవైపు ఎయిర్టెల్  పేమెంట్ బ్యాంక్  ఇ-చెల్లింపులను భారీగా   ప్రోత్సాహమిస్తోంది.  ఇటీవల ఎన్ని రూపాయలు డిపాజిట్ చేస్తే అన్ని నిమిషాల టాక్ టైం ఫ్రీ అని ప్రకటించిన  పే మెంట్ బ్యాంకు మరో ఆఫర్ ను మంగళవారం ప్రకటించింది.  తమ బ్యాంకు ద్వారా లావాదేవీలు జరిపిన  ఎయిర్ టెల్ ఖాతాదారులకు  100  నిమిషాల మొబైల్ టాక్ టైంను  ఉచితంగా అందిస్తోంది.  తమ బ్యాంకు ద్వారా డిజిటల్ ట్రాన్సాక్షన్  జరిపిన  వినియోగదారులకు లక్కీ డ్రా ద్వారా ఈ ఆఫర్ అందించనున్నట్టు పే మెంట్ బ్యాంక్  తెలిపింది  ప్రతీనెలాదాదాపు లక్షమంది  ఖాతాదారులకు  వంద నిమిషాల టాక్ టైం ను ఉచితంగా అందించనున్నట్టు  వెల్లడించింది.

క్యాష్ లెస్ ఆర్థిక వ్యవస్థవైపు  భారతదేశ ప్రయాణాన్ని వేగవంతం చేయాలన్న  ప్రభుత్వ  ప్రయత్నాలకు తమ బ్యాంకు ప్రయత్నాలు సహాయం చేస్తాయని బ్యాంక్ సీఈవో , ఎండీ  శశి అరోరా తెలిపారు. ప్రభుత్వ 'డిజిటల్  ఇండియా' విజన్ కు తాము కట్టుబడి ఉన్నామన్నారు.  భారతదేశం అంతటా జనవరి 2017 నుంచి మరికొన్ని ఆఫర్లు అందించనున్నట్టు తెలిపారు.

వినియోగదారులకు అవగాహన
260 మిలియన్లకు పైగా  ఉన్న తన వినియోగదారులకు  డిజిటల్ చెల్లింపులు ప్రయోజనాలపై అవగాహన కల్పించనుంది.  ముఖ్యంగా ప్రాథమిక / ఫీచర్ మొబైల్ ఫోన్లతో యూఎస్ ఎస్ డి ఆధారిత చెల్లింపులపై  ప్రత్యేక దృష్టి  పెట్టనుంది.  

డిజిటల్ పేమెంట్స్ ఎకో సిస్టం
దేశ వ్యాప్తంగా 30 లక్షలమంది భాగస్వామ్య సంస్థలతో కలిసి చిన్న చిన్న కిరణా దుకాణాలు, షాప్స్, రెస్టారెంట్స్ తదితర  వ్యాపార సముదాయాలను  ఏర్పాటు చేయనుంది.  తద్వారా మొబైల్ ఫోన్ల ద్వారానే చెల్లింపులకు అవకాశం  కల్పిస్తుంది.  ఇలా ఎయిర్టెల్ చెల్లింపులు బ్యాంక్ వినియోగదారుల నుంచి సరుకులు మరియు సేవలకుగాను డిజిటల్ చెల్లింపులను అంగీకరిస్తుంది.
 
ఉచిత డిజిటల్ చెల్లింపులు

డిజిటల్ లావాదేవీలకు  ఎయిర్టెల్ చెల్లింపులు బ్యాంక్ తన వినియోగదారులు, వ్యాపారులు, భాగస్వాముల నుంచి ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేయదు. ఉచితంగా ఈ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు.  ఎలాంటి హిడెన్ అండ్ యాడెడ్  చార్జీలు ఉండవు.  నగదు రహిత లావాదేవీల ప్రోత్సాహమే లక్ష్యం.  

అలాగే వ్యాపారస్తులు, వినియోగదారుల  నమోదు కూడా పూర్తిగా పేపర్ లెస్ గా ఉంటుంది. అంటే స్మార్ట్ ఫోన్ లోని ఒక యాప్ (స్మార్ట్ ఫోన్) సహాయంతో  గానీ, యుఎస్ఎస్డీ (ఫీచర్ ఫోన్) ద్వారాగానీ ఉంటుంది. అంతే కాదు కాష్ విత్  డ్రాలను నిరోధించేందుకు గాను  విత్ డ్రాలపై 0.65శాతం   కూడా చార్జ్ చేయనున్నట్టు తెలిపింది. దీని ద్వారా డిజిటల్  చెల్లింపులవైపు కస్టమర్లు మొగ్గు చూపుతారని బ్యాంక్  భావిస్తోంది.

మరిన్ని వార్తలు