పాదాలకు పసిడి బిస్కెట్లు అతికించుకుని..

7 Mar, 2017 17:06 IST|Sakshi
పాదాలకు పసిడి బిస్కెట్లు అతికించుకుని..

ముంబై: బంగారం అక్రమ రవాణాకు స్మగ్గర్లు వినూత్న పద్ధతులు అవలంభిస్తున్నారు. విదేశాల నుంచి అక్రమంగా బంగారం తీసుకువచ్చేందుకు రకారకాలుగా ప్రయత్నిస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. తాజాగా సింగపూర్ నుంచి వచ్చిన ప్రయాణికుడొకరు 12 బంగారపు బిస్కెట్లతో ముంబై విమానాశ్రయంలో ఏఐయూ అధికారులకు పట్టుబడ్డాడు. ఒక్కొక్కటి 100 గ్రాముల బరువున్న వీటి ధర రూ. 36,45,600గా అధికారులు అంచనా వేశారు.

వీటిని తరలించేందుకు నిందితుడు అనుసరించిన విధానం చూసి అధికారులు అవాక్కయ్యారు. 12 బంగారపు బిస్కెట్లను రెండు కాళ్ల పాదాలకు అతికించుకుని ఏమీ ఎరగనట్టు విమానం దిగాడు. ఒక్కో పాదానికి ఆరేసి బిస్కెట్లు అంతికించాడు. అధికారులకు అనుమానం వచ్చి క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో బండారం బట్టబయలైంది. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు