శ్రీలంక క్రికెటర్లపై దాడి: సూత్రధారి హతం

26 Mar, 2017 10:40 IST|Sakshi
శ్రీలంక క్రికెటర్లపై దాడి: సూత్రధారి హతం

అఫ్ఘానిస్థాన్‌లో అమెరికా నిర్వహించిన వైమానిక దాడుల్లో అల్‌కాయిదా కీలక ఉగ్రవాది నేలకూలాడు. 2008లో ఇస్లామాబాద్‌ హోటల్‌పై దాడి, 2009లో పాక్‌ పర్యటనకు వచ్చిన శ్రీలంక క్రికెటర్లపై దాడి వెనుక ప్రధాన సూత్రధారి అయిన కారి యాసిన్‌ను గతవారం అమెరికా నిర్వహించిన వైమానిక దాడుల్లో మృతిచెందాడు.

పాక్‌ బెలూచిస్థాన్‌కు చెందిన కారి యాసిన్‌ కరుడుగట్టిన ఉగ్రవాది. అతనికి తెహ్రిక్‌ ఈ తాలిబన్‌ సంస్థతో సంబంధాలు ఉన్నాయి. అల్‌కాయిదా నిర్వహించిన పలు ఉగ్రవాద దాడులకు పథక రచన చేశాడు. మార్చి 19న అఫ్గాన్‌లోని పక్టికా ప్రావిన్స్‌లో జరిపిన వైమానిక దాడుల్లో యాసిన్‌ ప్రాణాలు విడిచాడని తాజాగా అమెరికా అధికారులు ధ్రువీకరించారు. 2008 సెప్టెంబన్‌ 20న ఇస్లామాబాద్‌లోని మారియట్‌ హోటల్‌ లక్ష్యంగా జరిగిన ఉగ్రవాద దాడికి ప్రధాన సూత్రధారి యాసినే. ఈ ఉగ్రవాద దాడిలో ఇద్దరు అమెరికన్లు సహా పదుల సంఖ్యలో పలువురు ప్రాణాలు విడిచారు.

మరిన్ని వార్తలు