ఆస్ట్రేలియన్ల ఉసురు తీస్తున్న 'మద్యం'

31 Jul, 2014 13:43 IST|Sakshi
ఆస్ట్రేలియన్ల ఉసురు తీస్తున్న 'మద్యం'

కాన్‌బెర్రా : మద్యం ఆస్ట్రేలియన్ల ఉసురు తీస్తుందా అంటే అవుననే వెల్లడిస్తుంది తాజా నివేదిక. మద్యం తాగుతున్నవారిలో రోజుకు 15 మంది ఆస్ట్రేలియన్లు మరణిస్తున్నారని ఆ నివేదిక వెల్లడించింది. అలాగే 430 మంది  ఆసుపత్రి పాలవుతున్నారని తెలిపింది. మద్యం తాగుతున్నవారిపై విక్హెల్త్ అండ్ ఫౌండేషన్ ఫర్ అల్కహాల్ రిసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ (ఎఫ్ఏఆర్ఈ) ఓ సర్వే నిర్వహించింది. ఆ సర్వే నివేదికను గురువారం ఇక్కడ విడుదలు చేసింది. 2010 నాటి నుంచి గణాంకాలు ఆధారంగా మద్యం సేవిండం వల్ల 5554 మంది మృతి చెందారని, 157,132 మంది ఆసుపత్రి పాలైయ్యారని వివరించింది.

మద్యం సేవించడం వల్ల మృతి చెందుతున్న ఆస్ట్రేలియన్ల సంఖ్య ఇటీవల కాలంలో బాగా పెరిగిందని తెలిపింది. గతంలో ఆ సంఖ్య చాలా తక్కువగా ఉండేదని అయితే గత దశాబ్ద కాలంలో 62 శాతం మేర మృతుల సంఖ్య పెరిగిందని ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ మైఖేల్ త్రొన్ వెల్లడించారు. మద్యం కారణంగా సంభవిస్తున్న మరణాలను అరికట్టేందుకు సత్వరం చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించింది. ప్రభుత్వం ఇప్పటికైనా తేరుకోకుంటే మృతుల సంఖ్య మరింత పెరుగుతుందని మైఖల్ వివరించారు. ఆస్ట్రేలియన్లు మద్యం సేవించడం వల్ల కలిగే దుష్పలితాలను అన్ని కోణాల్లో ఆ నివేదక ఆవిష్కరించింది.

మరిన్ని వార్తలు