లాట్ మొబైల్ షోరూం ప్రారంభించిన అల్లు అర్జున్

11 Aug, 2013 11:36 IST|Sakshi
లాట్ మొబైల్ షోరూం ప్రారంభించిన అల్లు అర్జున్

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నగరంలోని హల్ చల్ చేశాడు. అమీర్పేటలో లాట్ మొబైల్ షోరూంను ఆదివారం ఉదయం బన్నీ ప్రారంభించాడు. అల్లు అర్జున్ను చూసేందుకు భారీగా జనం తరలివచ్చారు. అతడితో కరచాలనం చేసేందుకు పోటీ పడ్డారు. షోరూం ప్రారంభించిన అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడకుండా  అబిమానులకు అభివాదం చేసుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

మొబైల్ రిటైల్ విక్రయ సంస్థ లాట్ మొబైల్స్‌కు అల్లు అర్జున్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. ఈ ఒక్కరోజే హైదరాబాద్‌లో 15 షోరూమ్లు ప్రారంభమవుతున్నాయని లాట్ మొబైల్ ప్రతినిధులు తెలిపారు. దీంతో హైదరాబాద్‌లో తమ మొత్తం మొబైల్ షోరూమ్‌ల సంఖ్య 50కు చేరుతుందని, ఇవన్నీ ప్రత్యేక లైవ్ ఎక్స్‌పీరియన్స్ షోరూమ్‌లుగా వినియోగదారులకు సేవలందిస్తాయని వివరించింది. 

తమ షోరూమ్‌ల్లో అన్ని రకాల బ్రాండ్స్, మొబైల్ ఫోన్స్‌ను అన్ని బ్యాంకుల క్రెడిట్/డెబిట్ కార్డుల ద్వారా ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు, వడ్డీ లేకుండా కొనుగోలు చేయవచ్చని పేర్కొంది. ప్రతి మొబైల్ కొనుగోలుపై బీమా, విక్రయానంతర సేవలు అందిస్తున్నామని, లాట్ మొబైల్స్‌లో ఒక లక్షకు పైగా ఆప్స్ డౌన్‌లోడ్ చేసుకునే వీలుందని కంపెనీ వివరించింది.

మరిన్ని వార్తలు