టైప్-2 ముదిరితే అల్జీమర్స్

2 Dec, 2013 01:58 IST|Sakshi

లండన్: టైప్-2 మధుమేహం ముదిరితే అది అల్జీమర్స్ (మతిమరుపు సంబంధ వ్యాధి)కు దారితీస్తున్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. తొలి దశలోనే గుర్తించి సరైన వ్యాయామం చేస్తూ, బరువును తగ్గించుకుంటే అల్జీమర్స్‌కు దూరంగా ఉండొచ్చని సూచిస్తున్నారు. టైప్-2 మధుమేహంతో బాధపడుతున్నవారి దేహంలో అధికంగా ఉత్పత్తి అయ్యే ఇన్సులిన్.. మెదడు కణాలపై దుష్ర్పభావం చూపుతుందని, కొంతకాలానికి ఆ కణాలు పూర్తిగా దెబ్బతిని అల్జీమర్స్ వస్తుందని పరిశోధకులు వెల్లడించారు. అల్జీమర్స్ బారిన పడుతున్నవారిలో 70 శాతం మంది టైప్-2 మధుమేహం వ్యాధిగ్రస్తులే ఉండడంతో వీటి మధ్య సంబంధాన్ని కనుగొనేందుకు ప్రయోగాలు జరిపారు.

>
మరిన్ని వార్తలు