అమెజాన్ లో 1,000 ఉద్యోగాలు

8 Jul, 2016 13:23 IST|Sakshi
అమెజాన్ లో 1,000 ఉద్యోగాలు

బ్రెగ్జిట్ దెబ్బతో ఉద్యోగాల కల్పనలో మందగమనం ఏర్పడే అవకాశాలున్నాయని భయాందోళనలు నెలకొన్న పరిస్థితుల్లో, ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మాత్రం కొత్త ఉద్యోగాల సృష్టిపై దృష్టి పెట్టింది. యూకేలో వెయ్యి కొత్త ఉద్యోగాలను కల్పిస్తామని ప్రకటించింది. అల్ట్రా ఫాస్ట్ డెలివరీ ప్రైమ్ నౌ సేవల వృద్ధిని కొనసాగించడానికి కంపెనీ ఈ ఉద్యోగ అవకాశాలు చేపడతామని అమెజాన్ తెలిపింది. 30శాతానికి పైగా యూకే ప్రజలకు ప్రైమ్ నౌ సేవలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.

యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగేందుకు ప్రజలు తీసుకున్న నిర్ణయాన్ని తాము మార్చలేమని, అంచనాలకు అనుగుణంగానే తమ అమ్మకాలు కొనసాగిస్తామని, అమెజాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డౌ గురు చెప్పారు. బ్రెగ్జిట్ ప్రతిఫలం ఎలా ఉంటుందని తమకి తెలియదని, కానీ ప్రస్తుతం ఎలా అయితే బిజినెస్ నిర్వర్తిస్తున్నామో అలానే చేపడతామన్నారు. 2,500 స్థానాలకు రిక్రూట్ మెంట్ డ్రైవ్ చేపడతామని కంపెనీ ఈ ఏడాది మొదట్లోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎండిన్ బర్గ్, మాంచెస్టర్, లీసెస్టర్ షైర్, కేంబ్రిడ్జ్, లండన్ ల్లో ఈ ఉద్యోగాలు చేపడతామని అప్పుడే తెలిపింది.

కొత్తగా సృష్టిస్తున్న ఉద్యోగులతో కలిపి, అమెజాన్ ను 15,500 మంది పర్మినెంట్ ఉద్యోగులు ఉండబోతోంది. మరో 74వేల యూకే ఉద్యోగాలకు అమెజాన్ తన మార్కెట్ ప్లేస్ ద్వారా ఉపాధి కల్పిస్తోంది. స్థానిక ఆన్ లైన్ బుక్ రిటైలర్ కొనుగోలుతో, 1998లో మొదట యూకే వ్యాపారాల్లోకి అమెజాన్ ప్రవేశించింది. అప్పటినుంచి అన్ని రకాల రిటైలింగ్, ఇతర సేవలను ఈ ఈ-కామర్స్ సంస్థ చేపడుతోంది.

>
మరిన్ని వార్తలు