అమెజాన్ బాస్ కొత్త ఇల్లు ఖరీదెంతో తెలిస్తే...

13 Jan, 2017 19:56 IST|Sakshi
అమెజాన్ బాస్ కొత్త ఇల్లు ఖరీదెంతో తెలిస్తే...

వాషింగ్టన్:  అమెజాన్ వ్యవస్థాపకుడు , టెక్ బిలియనీర్  జెఫ్ బెజోస్  అద్భుతమైన ఇంటిని సొంతం చేసుకున్నారు.  అమెరికా రాజధాని వాషింగ్ టన్ లో కొత్త ఇంటిని కొనుగోలు చేశారు. పోష్ ఏరియా  కలోరమా జిల్లాలోని ఐదు బ్లాక్స్  ప్రాంతంలో ఈ కొత్త నివాసం ఉండనుంది. నగరంలోని అతి పెద్ద ప్రైవేట్ రెసిడెన్సీలో సుమారు రూ. 1.57కోట్లు ( 23 మిలియన్ డాలర్లు) విలువ చేసే ఇంటికి యజమాని అయ్యారు. 27,000 చదరపు అడుగుల (2,500 చదరపు మీటర్లు) విస్తీర్ణంలో ఉన్న ఇంటిని కొనుగోలుచేసినట్టు వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. అంతేకాదు 7,000 చదరపు అడుగుల అధికారిక తోట ఇందులో ఉందని  బెజోస్ సొంతమైన వాషింగ్టన్ పోస్ట్ గురువారం నివేదించింది.  అదీ మొత్తం నగదు  రూపంలో  చెల్లించినట్టు తెలిపింది.
 
ఇందులో బరాక్  ఒబామా , మిచెల్ ఒబామా  నివాసంతో పాటు, అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయిన డోనాల్డ్ ట్రంప్ కుమార్తె,  ఇవాంకా, ఆమె భర్త జారెడ్ కుష్నెర్ నివాసం కూడా ఇక్కడే.  అయితే సియాటెల్ లోని బెజోస్ ఇల్లు  ప్రధాన నివాసంగా ఉన్నప్పటికీ,   భార్య, నలుగురు పిల్లలు తో విజిటింగ్స్,   ఎంటర్ టైన్ మెంట్  కోసం ఈ వాషింగ్టన్  కొత్త  ఇంటిని ఉపయోగించనున్నారని నివేదించింది.

మరోవైపు న్యూ యార్క్ టైమ్స్ ప్రకారం,  బెజోస్  కొత్త ఇంటికి సమీపంలోని కుష్నెర్ ట్రంప్ ఇల్లు  విస్తీర్ణం 6.870 చదరపు అడుగులు (630 చదరపు మీటర్లు) మాత్రమే. అయితే దీన్ని ఎంబసీగా కానీ, ప్రయివేటు స్కూలుకోసం విక్రయించాలని రియల్టర్లు అనుకున్నారట. 

ప్రస్తుతం బెజోస్ సొంతం చేసుకున్న ఈ నివాసం  ఒకపుడు  టెక్స్ టైల్ మ్యూజియంగా విలసిల్లింది. అనంతరం  దీన్ని జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ కి తరలించారు. 2013 వాషింగ్టన్ పోస్ట్  పత్రికను  జెఫ్ బెజోస్  కొనుగోలుచేశారు.  బెజోస్ సంపదను  70 మిలియన్ల డాలర్లుగా అంచనావేసిన  ఫోర్బ్స్  ప్రపంచంలోని అత్యధిక ధనవంతుల  జాబితాల్లో చేర్చిన సంగతి  తెలిసిందే.
 

మరిన్ని వార్తలు