లక్ష మార్క్ దాటేసిన అమెజాన్

11 Jul, 2016 17:06 IST|Sakshi
లక్ష మార్క్ దాటేసిన అమెజాన్

ముంబై : ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్, ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో తన ప్లాట్ ఫామ్ పై లక్ష అమ్మకందారుల మైలురాయిని చేధించింది. యేటికేటికి 250 శాతం అమ్మకందారుల వృద్ధిని నమోదుచేసుకుంటూ.. వ్యాపారాల్లో దూసుకెళ్తోంది. అమెజాన్ భారత్ లో అడుగుపెట్టిన మూడేళ్లలో వివిధ వ్యాపార అవసరాలను తీర్చేందుకు అమ్మకందారుల తరుఫున పనిచేస్తూ.. ఆన్ లైన్ లో తమ బిజినెస్ లు పెంచుకునేందుకు సహకరిస్తోందని  అమెజాన్ ఇండియా జనరల్ మేనేజర్, సెల్లర్ సర్వీసుల డైరెక్టర్ గోపాల్ పిల్లై పేర్కొన్నారు. దీంతో తమ ప్లాట్ ఫామ్ పై ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో లక్ష అమ్మకందారులకు పైగా కలిగి ఉన్నామని ఆయన వెల్లడించారు. 2013 జూన్ లో అమెజాన్ భారత్ లో ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ లోకి ప్రవేశించింది.
   
విస్తృతమైన విద్య, నైపుణ్యమైన ప్రోగ్రామ్ లు చేపట్టడం, అమ్మకందారుల తరుఫున ఉత్పత్తులకు అమెజాన్.ఇన్ ప్యాకింగ్, షిప్స్, డెలివరీ నిర్వహించడం, రిటర్న్ లను నిర్వహించడం, ఇతర సర్వీసులను అమెజాన్ అందిస్తోంది. ఒక్క భారత్ లోనే కాక, ప్రపంచవ్యాప్తంగా.. అమెజాన్ గ్లోబల్ సెల్లింగ్ ప్రోగ్రామ్ ద్వారా 3040 లక్షల యాక్టివ్ కస్టమర్లను అమెజాన్ కలిగి ఉన్నట్టు పిల్లై తెలిపారు. గ్లోబల్ సెల్లింగ్ ప్రోగ్రామ్ కింద  8వేల అమ్మకందారులు ప్రపంచవ్యాప్తంగా ఉండే దుకాణదారులకు, తమ ఉత్పత్తులను విక్రయిస్తున్నట్టు పేర్కొన్నారు. అమెజాన్ తన ప్లాట్ ఫామ్ అమ్మకందారులకు రూ.5లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు సెక్యూర్డ్, అన్ సెక్యూర్డ్ రుణాలను అందిస్తోంది.

>
మరిన్ని వార్తలు