అమెరికా గొప్పదేం కాదు

22 Sep, 2016 20:25 IST|Sakshi

ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన దేశం అమెరికా. అత్యంత బలమైన ఆర్ధికవ్యవస్ధ కలిగిన అమెరికా.. గొప్ప దేశం కాదని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. ప్రజారోగ్యం(వ్యాధుల నిర్మూలన) విషయంలో అమెరికా 28వ స్ధానంలో ఉందని లాన్సెట్ లో ప్రచురితమైన పరిశోధనలో తేలింది. అమెరికా యూఎన్ సూచనలను ఆచరణలో పెట్టడంలో విఫలం చెందడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.

ఓ వైపు అగ్రరాజ్యం ప్రజల ఆరోగ్య విషయంలో వెనుకబడిపోగా.. యూఎన్ సలహాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఐలాండ్, స్వీడన్, సింగపూర్ దేశాలు టాప్ లో నిలిచాయి. పేదరికం, శుభ్రమైన నీరు, విద్య, సామాజిక అసమానతలు, నూతన పద్ధతుల అవలంబనల ఆధారంగా లాన్సెట్ ఈ పరిశోధన చేసింది. 124 దేశాల్లో దాదాపు 1,870మంది పరిశోధకులు ఏడాదిన్నరకాలం పాటు వివిధ అంశాలపై పరిశోధనలు చేసి ఈ వివరాలు రూపొందించింది.

తాగునీరు, పరిశుభ్రత, పిల్లల వికాసం తదితర అంశాల్లో యూఎస్ మంచి మార్కులు సంపాదించింది. వైయలెన్స్, సహజ వైపరీత్యాలు, హెచ్ఐవీ, ఆత్మహత్యలు, ఆల్కహాల్ లు యూఎస్ ను ర్యాంకింగ్ స్ధానాల్లో కిందకు దిగజార్చాయి. మిగిలిన అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే పబ్లిక్ హెల్త్ పై అమెరికా అంతగా దృష్టిసారించడం లేదని తేలింది.

యూఎన్ సూచనలతో సాధించిన దేశాల్లో కొన్ని
- టిమోర్ లెస్టే అనే చిన్న దేశం కొన్ని సంవత్సరాల యుద్ధంలోనే గడిపింది. 2000సంవత్సరం తర్వాత ప్రజారోగ్య వ్యవస్ధను పునరుద్ధరించుకుంది.
- 1990లో ప్రజారోగ్య వ్యవస్ధ పనితీరును మార్చుకున్న తజకిస్ధాన్ ప్రస్తుతం మలేరియాపై సంపూర్ణ విజయం దిశగా సాగుతోంది.
- ప్రపంచంలోనే అత్యధిక ఆరోగ్య ఇన్సూరెన్స్ పాలసీలను ప్రజలకు కొలంబియా అందించింది. క్యాన్స్రర్ లాంటి అతిపెద్ద జబ్బులకు కూడా ఇన్సూరెన్స్ ద్వారా చికిత్సను అందిస్తోంది
- రోడ్డు భద్రతా నిబంధనలను కట్టుదిట్టం చేసిన తైవాన్.. యాక్సిడెంట్ల మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించింది.
- టొబాకో పదార్ధాల వినియోగానికి వ్యతిరేకంగా పాలసీలను తెచ్చిన ఐలాండ్ ర్యాంకుల జాబితాలో ముందంజలో ఉంది.

మరిన్ని వార్తలు