రూపాయి 70 స్థాయికి దిగజారుతుందా?

12 Dec, 2016 14:46 IST|Sakshi
రూపాయి 70 స్థాయికి దిగజారుతుందా?

ముంబై:   దేశీయ కరెన్సీ రూపాయి సోమవారం  మరింత బలహీనపడుతోంది. ఫెడ్ వడ్డీరేట్లు పెరగనున్నాయనే అంచనాల నేపథ్యంలో డాలర్ ఒకవైపు దూసుకుపోతుండగా రూపాయి మరింత దిగజారుతోంది.  డాలర్ మారకపు విలువలో 68  రూపాయల నుంచి దిగజారి మరింత పతనం దిశగా పయనిస్తోంది.  ఆరంభంలోనే శుక్రవారం నాటి 68.13 తో  పోలిస్తే. 68.16 స్థాయికి పడిపోయింది.  గతవారం రూపాయి 31 పైసలు క్షీణించి, 9 నెలల కనిష్ట 68.13 వద్ద స్థాయి వద్ద  ముగిసింది.

రూపాయి బలహీనత రాబోయే కాలంలో విశ్లేషకులు కొనసాగనుందనివిశ్లేషకులు భావిస్తున్నారు. త్వరలో 2013 నాటి  68. 85 స్థాయికి చేరుతందని హెచ్ ఆర్ బీవీ  క్లయింట్ సొల్యూషన్స్ వ్యవస్థాపకుడు టీఎస్ హరిహర్  తెలిపారు.  ఈ నేపథ్యంలో డాలర్  తో  పోలిస్తే రూ. 70  మార్క్ కు పడిపోనుందని చెప్పారు.   ట్రంప్  విజయం,  డాలర్ 14 సంవత్సరాల  గరిష్టాన్ని నమోదు చేయడంద  దీనికి కారణమన్నారు. మరోవైపు  అమ్మకాల ఒత్తిడితో  దేశీయ స్టాక్ మార్కెట్లునష్టాలతో కొనసాగుతున్నాయి.
ప్రధాన ఆరు ప్రపంచ కరెన్సీలకు వ్యతిరేకంగా డాలర్  పెరుగుదల, దేశీయ సూచీల్లో ఫారిన్ పెట్టుబడిదారుల అమ్మకాల కారణంగా  రూపాయ  పతనం కొనసాగుతోందని విశ్లేషకులు అంచనావేశారు. భారత ఈక్విటీ మార్కెట్ లో విదేశీ మదుపరులు ఇప్పటివరకు  రూ. 9,000 కోట్ల విలువకు పైగా విక్రయించడం,  అలాగే పెద్ద నోట్ల రద్దు నిషేధం కూడా దేశీయ మార్కెట్ సెంటిమెంట్ ను దెబ్బతీస్తోందన్నారు.

మరోవైపు గత వారం విడుదలచేసిన అమెరికా వినియోగదారుల ధరల అక్టోబర్  డేటా  గత ఆరునెలల స్తాయిని  దాటి, తొమ్మిది సంవత్సరాల గరిష్ఠానికి చేరింది. ఫెడరల్ రిజర్వ్ చైర్ జానెట్  డిసెంబర్ లో వడ్డీ రేట్లు పెరగనున్నాయనే  సంకేతాలు అందించిన  సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు