అమ్నెస్టీ ఆఫీసులు తాత్కాలికంగా మూత

18 Aug, 2016 13:17 IST|Sakshi
అమ్నెస్టీ ఆఫీసులు తాత్కాలికంగా మూత

అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ అమ్నెస్టీ, భారత్లో తన ఆఫీసులను తాత్కాలికంగా మూసివేసింది. బెంగళూరు, పుణే, న్యూఢిల్లీ, చెన్నై ఆఫీసులను మూసివేయడంతో పాటు, తమ ఈవెంట్లను పోస్ట్పోను చేస్తున్నట్టు వెల్లడించింది. స్వచ్ఛంద నిరసనకారులు తమపై దేశ ద్రోహ ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ మేరకు అమ్నెస్టీ నిర్ణయం తీసుకుంది. బెంగళూరులో కశ్మీర్ అంశంపై ఆ సంస్థ ఏర్పాటు చేసిన చర్చాకార్యక్రమంలో కొందరు దేశ ద్రోహ నినాదాలు చేశారనే ఆరోపణలతో అమ్నెస్టీపై దేశ ద్రోహ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ద్వేషాన్ని ప్రోత్సహించారనే ఆరోపిస్తూ.. కొందరు రాజకీయ కార్యకర్తలు ఈ సంస్థ హక్కులపై వ్యతిరేకంగా మంగళవారం, బుధవారం ప్రదర్శనలు కూడా చేపట్టారు.

అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) ఫిర్యాదు మేరకు, అమ్నెస్టీ ఏర్పాటుచేసిన చర్చా కార్యక్రమంలో దేశ ద్రోహ నినాదాలు జరిగాయా..అనే దానిపై విచారణ చేపట్టామని పోలీసులు చెప్పారు. అయితే తమపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని, బెంగళూరు సెమినార్కు హాజరైన కొంతమంది ప్రజలు కశ్మీర్ స్వాతంత్ర్యాన్ని మాత్రమే కోరుకుంటూ నినాదాలు చేశారని ఆ సంస్థ తెలిపింది. అమ్నెస్టీకి వ్యతిరేకంగా ఎలాంటి ప్రాతిపదికన లేకుండా కేసును నమోదుచేశారని చారిటీ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఆ కార్యక్రమం అందరినీ ఆహ్వనించదగినదని, ప్రజలు వస్తుంటారు, పోతుంటారు. కానీ సంస్థకు చెందిన ఎవరు దీనిలో పాల్గొనలేదని వివరించారు. జమ్ము కశ్మీర్లోని బాధితులకు న్యాయం చేసేందుకే తాము చర్చా కార్యక్రమం నిర్వహించామని అమ్నెస్టీ స్ఫష్టం చేసింది.  దీనికి సంబంధించిన వీడియోను అమ్నెస్టీ పోలీసులకు సమర్పించింది. ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేటర్లు దీనిపై విచారణ చేపడతారని పోలీసు అధికారి ఒకరు చెప్పారు.

మరిన్ని వార్తలు