కేసీఆర్‌కు ఉదయభాను ఆహ్వానం

30 Aug, 2017 19:32 IST|Sakshi
కేసీఆర్‌కు ఉదయభాను ఆహ్వానం

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును బుల్లితెర వ్యాఖ్యాత, నటి ఉదయభాను మర్యాదపూర్వకంగా కలిశారు. భర్తతో కలిసి బుధవారం సీఎం క్యాంప్‌ ఆఫీస్‌కు వచ్చిన ఆమె.. తమ పిల్లల పుట్టినరోజు వేడుకకు రావాల్సిందిగా సీఎంను ఆహ్వానించారు.

ఉదయభాను దంపతుల విజ్ఞప్తికి సీఎం కేసీఆర్‌ సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. బంజారాహిల్స్‌లోని పార్క్‌ హయత్‌ హోటల్‌లో సెప్టెంబర​ 3న పిల్లల పుట్టిన రోజు వేడుక జరగనుంది. సీఎంతో భేటీ అనంతరం తన ఫేస్‌బుక్‌లో ఫొటోలు పోస్ట్‌ చేసిన ఉదయభాను.. ‘‘కేసీఆర్‌ దేశంలోనే డైనమిక​ లీడర్. మా పిల్లలకు ఆయన ఆశీర్వాదాలు వెలకట్టలేనివి’’ అని కామెంట్‌ పెట్టారు. ప్రేమ వివాహం చేసుకున్న ఉదయభాను గత ఏడాది కవలపిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.