డిపాజిట్ రేట్లను తగ్గించిన ఆంధ్రాబ్యాంక్

3 Jan, 2014 01:43 IST|Sakshi

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిపాజిట్లపై వడ్డీరేట్లను స్వల్పంగా తగ్గిస్తూ ప్రభుత్వరంగ ఆంధ్రాబ్యాంక్ నిర్ణయం తీసుకుంది. ఈ తగ్గిన రేట్లు ఈనెల 1 నుంచి అమల్లోకి వచ్చాయి. సవరించిన తర్వాత 444 రోజుల డిపాజిట్ పథకంపై అత్యధికంగా 9.05% వడ్డీని (రూ. కోటి లోపు) ఆఫర్ చేస్తుండగా, ఏడాది నుంచి మూడేళ్లలోపు డిపాజిట్లపై 9% వడ్డీని ఇస్తోంది. అలాగే అధికాదాయ వర్గాల వారి కోసం ప్రత్యేకంగా 179 రోజుల ప్రత్యేక డిపాజిట్ పథకాన్ని ఆంధ్రాబ్యాంక్ ప్రవేశపెట్టింది. కనీసం కోటి రూపాయలు డిపాజిట్ చేయాల్సిన ఈ పథకంపై 7.8% వడ్డీ అందిస్తోంది. 7 రోజుల తర్వాత కాలపరిమితి కంటే ముందే డబ్బు వెనక్కి తీసుకున్నా ఎలాంటి పెనాల్టీలు లేకపోవడం ఈ పథకంలోని ప్రధానమైన ఆకర్షణ.
 

>
మరిన్ని వార్తలు