తెలంగాణను కాపీ కొట్టిన ఏపీ మీసేవ

3 Jul, 2017 10:50 IST|Sakshi
తెలంగాణను కాపీ కొట్టిన ఏపీ మీసేవ

అమరావతి: టెక్నాలజీలో తనకు తానే సాటి అని చెబుతున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.... మరో తెలుగు రాష్ట్రం తెలంగాణ మీసేవ వెబ్ పోర్టల్ ను మక్కీకి మక్కీగా కాపీ కొట్టి అభాసుపాలైంది. కనీసం వెబ్ సైట్ మాస్టర్ హెడ్ను కూడా మార్చకుండా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని ఉంచేయడం గమనార్హం. అంతేకాకుండా ఏపీ ప్రభుత్వ లోగోను కూడా మార్చకుండా తెలంగాణ లోగోను కాపీ కొట్టేసింది.

కేవలం ఐటీ శాఖ మంత్రి లోకేష్, ముఖ్యమంత్రి ఫోటోలు, ఇతర కొద్ది సమాచారం మినహా మిగిలినదంతా తెలంగాణ వెబ్సైట్ను దించేసింది. ఈ మార్పు ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ సోషల్ మీడియాలో దీనిపై సెటైర్లు వైరల్ అవడంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. అప్పటికప్పుడు తెలంగాణ లోగో తీసి ఏపీ లోగో పెట్టింది. గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అని పెట్టకుండా ఇంటిగ్రేటెడ్ సర్వీసె స్ డెలివరీ సిస్టమ్ అని ఉంచింది.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు