పోటీ పరీక్షలకు మరో 8 పుస్తకాలు

9 Oct, 2015 00:50 IST|Sakshi
పోటీ పరీక్షలకు మరో 8 పుస్తకాలు

సిద్ధం చేస్తున్న తెలుగు అకాడమీ
వారంలో ఒకటి, నెలాఖరుకు మరో 7 అందుబాటులోకి
తెలుగు అకాడమీ డెరైక్టర్ సత్యనారాయణరెడ్డి వెల్లడి

 
హైదరాబాద్: రాష్ట్రంలో పోటీ పరీక్షల కోసం సిద్ధమయ్యే అభ్యర్థుల కోసం తెలుగు అకాడమీ మరో 8 కొత్త పుస్తకాలను అందుబాటులోకి తేనుంది. ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ ప్రకటించిన పోటీ పరీక్షల సిలబస్‌లోని అంశాలకు సంబంధించిన వివిధ పుస్తకాలను అందుబాటులో ఉంచిన అకాడమీ వివిధ వర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లతో మరో 8 పుస్తకాలను సిద్ధం చేయిస్తోంది. ఈ నెలాఖరులోగా వాటిని అభ్యర్థులకు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు అకాడమీ డెరైక్టర్ సత్యనారాయణరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఇప్పటివరకు జాతీయ స్థాయి అంశాలైన భారత ఆర్థిక వ్యవస్థ-అభివృద్ధి, భారత రాజ్యాంగం, ప్రభుత్వ పాలన శాస్త్రం, భౌతిక, భూగోళ శాస్త్రం, భారత స్వాతంత్య్రోద్యమ చరిత్ర వంటి  12 రకాల పుస్తకాలను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఇంటర్మీడియెట్ లో మార్పు చేసిన పుస్తకాల్లో తెలంగాణకు సంబంధించిన పలు అంశాలు ఇప్పటికే ఉన్నప్పటికీ పోటీ పరీక్షలకు అవసరమైన కోణం, పూర్తి విశ్లేషణలతో ఈ పుస్తకాలను అకాడమీ అందుబాటులోకి తెస్తోంది. వీటితోపాటు అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా జనరల్ స్టడీస్ పుస్తకాన్ని అకాడమీ ప్రత్యేకంగా ముద్రిస్తోంది. మరో వారంలో ఇది అందుబాటులోకి రానుంది.

కొత్త పుస్తకాల్లోని ప్రత్యేకాంశాలు..
త్వరలో అందుబాటులోకి రానున్న తెలంగాణ చరిత్ర-సంస్కృతి, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, తెలంగాణ భౌగోళిక చరిత్ర వంటి పుస్తకాల్లో తెలంగాణ పరిచయం, పూర్వ తెలంగాణ చరి త్ర, ప్రాచీన తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సాహిత్య చరిత్ర, శాతవాహనుల పూర్వకాలం, శాతవాహనుల తరువాత కాలం, మధ్యయుగ తెలంగాణ చరిత్ర, కాకతీయుల కాలం, పద్మనాయకులు, నాయంకరణులు, ముసునూరి నాయకులు, బహమనీ పరిపాలన, కుతుబ్‌షాహీల కాలం, మెఘల్‌ల కాలం, అసఫ్‌జాహీలు, నిజాంల పాలన, స్వతంత్ర హైదరాబాద్ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు, పూర్వ తెలంగా ణ ఉద్యమం, మలి దశ తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, ఉద్యమాల్లో ప్రజా సంఘాలు, కవులు, కళాకారులు వంటి అంశాలను అకాడమీ పొందుపరుస్తోంది.

ఇంటర్ పుస్తకాల్లోనూ తెలంగాణ సంబంధ అంశాలు
ప్రస్తుతం ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పుస్తకాల్లోనూ తెలంగాణకు సంబంధించిన పలు అంశాలు ఉన్నాయని, అవి కూడా అభ్యర్థులకు ఉపయోగపడతాయని అకాడమీ డెరైక్టర్ సత్యనారాయణరెడ్డి చెప్పారు. వాటిలో తెలంగాణ చరిత్ర, భౌగోళిక, ఆర్థికశాస్త్రం, సామాజిక, రాజకీయ ఉద్యమాలు, పర్యావరణ పోరాటాలు, తెలంగాణ ఉద్యమం, రాజకీయ పార్టీలు, జేఏసీల పాత్ర, చరిత్ర ఆధారాలు, సంక్షిప్త రాజకీయ చరిత్ర, రాష్ట్ర నిర్మాణం, ఆర్థిక లక్షణాలు, తలసరి ఆదాయం, జనాభా లక్షణాలు, సంక్షేమ కార్యక్రమాలపై పాఠ్యాంశాలు ఉన్నాయి.
 
త్వరలో అందుబాటులోకి రానున్న పుస్తకాలు
 .
తెలంగాణ చరిత్ర-సంస్కృతి
తెలంగాణ ఉద్యమం- రాష్ట్ర అవతరణ
తెలంగాణ ఆర్థిక వ్యవస్థ
తెలంగాణ పర్యావరణ సమస్యలు- అభివృద్ధి
{పభుత్వ పాలన శాస్త్రం
సమాజ  శాస్త్రం
తెలంగాణ ప్రాంతీయ భౌగోళిక శాస్త్రం
జనరల్ స్టడీస్ ఇదివరకే అందుబాటులో ఉంచినవి
ఇండియన్ జియోగ్రఫీ
భారత ఆర్థిక వ్యవస్థ
ఇండియన్ సోషియాలజీ
పర్యావరణం
సైన్స్ అండ్ టెక్నాలజీ
స్పేస్ టెక్నాలజీ
భారత రాజ్యాంగం
{పభుత్వ పాలన శాస్త్రం
భారత స్వాతంత్య్రోద్యమ చరిత్ర
 
 

మరిన్ని వార్తలు