జీఎస్టీ కౌన్సిల్కి మరో తలనొప్పి

25 Jan, 2017 18:46 IST|Sakshi
జీఎస్టీ కౌన్సిల్కి మరో తలనొప్పి
న్యూఢిల్లీ : జీఎస్టీ కౌన్సిల్కు మరో తలనొప్పి ఎదురుకాబోతుంది. ఇటీవల జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ పలు పరోక్ష పన్ను అధికారుల అసోసియేషన్లు సహాయ నిరాకరణ ఉద్యమానికి దిగేందుకు సిద్ధమయ్యారు.. శుక్రవారం జరుగబోయే ఇంటర్నేషనల్ కస్టమ్స్ డేను జరుపుకోమని ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. అంతేకాక జనవరి 30న జరుగబోయే అమరుల దినోత్సవం రోజు కూడా బ్లాక్ బ్యాడ్జ్లను ధరించి బ్లాక్ డేను నిర్వహిస్తామని హెచ్చరించారు.
 
ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ నేతృత్వంలో జనవరి 16న జరిగిన జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో ఎక్కువగా నిరాశపరిచే నిర్ణయాలు తీసుకుని మోసం చేశారని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. 12 నాటికల్ మైళ్ల పరిధిలో ఉన్న ప్రాదేశిక జలాల ఆర్థిక వ్యవహారాలపై లెవీ ట్యాక్స్ అధికారాలను కౌన్సిల్ రాష్ట్రాలకు ఇచ్చింది. రూ.1.5 కోట్ల వార్షిక టర్నోవర్ కిందనున్న పన్ను చెల్లింపుదారుల హక్కులూ 90 శాతం రాష్ట్రాలకే ఇస్తున్నట్టు ప్రకటించింది..
 
ఈ నిర్ణయం కేవలం రెవెన్యూ ఆఫీసర్ల కెరీర్పైనే కాదని, ఇది అసలు జాతీయ ప్రయోజనం కాదని ఉద్యోగులు పేర్కొన్నారు. జీఎస్టీ కౌన్సిల్ ఈ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ నిర్ణయం వల్ల కేంద్రం బలహీన పడడమే కాక, ఆర్థిక వ్యవస్థపై, రెవెన్యూ వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ సెంట్రల్ బోర్డులోని ఏ,బీ,సీ గ్రూప్ ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహించే స్టాండింగ్ కమిటీ అసోసియేషన్ మీటింగ్ అనంతరం ఈ నిర్ణయాలను వారు ప్రకటించారు. మొత్తం 70వేల మంది అధికారులు సహాయ నిరాకరణ ఉద్యమానికి దిగనున్నట్టు ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి. 
 
మరిన్ని వార్తలు