షీనా బోరా కేసులో మరో ట్విస్టు!

28 Jan, 2017 12:50 IST|Sakshi
షీనా బోరా కేసులో మరో ట్విస్టు!

ముంబై: దేశంలో సంచలనం సృష్టించిన షీనాబోరా (24) హత్య కేసులో మరో ట్విస్టు ఇది. షీనా హత్యకు గురైన ఐదేళ్ల తర్వాత ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా, సవతి తండ్రి పీటర్ ముఖర్జియాలపై సీబీఐ హత్య, నేరపూరిత కుట్ర అభియోగాలు మోపిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సీబీఐ ప్రత్యేక కోర్టులో చార్జిషీటు కూడా దాఖలైంది. చార్జిషీటుపై  పసీబీఐ ఫిబ్రవరి 1 నుంచి ప్రత్యేక కోర్టులో విచారణ కూడా మొదలుకానుంది.

ఈ నేపథ్యంలో రాహుల్‌ ముఖర్జియా తండ్రి పీటర్‌ ముఖర్జియాకు మద్దతు పలికాడు. ఆయన నిర్దోషి అని, ఆయనకు షీనా హత్యకు ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నాడు. తన కూతురైన షీనాకు, సవతి కొడుకైన రాహుల్‌ మధ్య అనుబంధం ఉండటం.. అది తనకు గిట్టకపోవడం వల్లే ఆమెను ఇంద్రాణి ముఖర్జియా హత్య చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్‌ తన తండ్రికి మద్దతు పలుకడం ప్రాధాన్యం సంతరించుకుంది.  
 
2012 ఏప్రిల్ నెలలో షీనాను కారులో ముంబై శివార్లకు తీసుకెళ్లిన ఇంద్రాణి.. తన మాజీ భర్త, డ్రైవర్ల సహాయంతో ఆమెను పీకనులిమి చంపేసిందని ఆరోపణలున్నాయి. సగం కాలిన స్థితిలో ఉన్న షీనాబోరా మృతదేహం 2015 సంవత్సరంలో ముంబై సమీపంలోని అడవుల్లో దొరికింది. అదే సంవత్సరం ఆగస్టులో ఇంద్రాణిని పోలీసులు అరెస్టుచేశారు.

మరిన్ని వార్తలు