ఆ ముగ్గురూ శిక్షార్హులే: రఘవీరా

17 Oct, 2015 12:46 IST|Sakshi

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ను ఏపీ కాంగ్రెస్ నేతలు రాజ్భవన్లో కలిశారు. ఏపీ పీసీసీ చీఫ్ రఘవీరారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా అంశంపై గవర్నర్కు  వినతి పత్రం సమర్పించిన వారిలో కేవీపీ, జేడీ శీలం, కొండ్రు మురళి సహా పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు.
ఈ వినతి పత్రంలో ముఖ్యాంశాలు

  • రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేశాయి
  • ప్రధాని మోదీ,  కేంద్రమంత్రి వెంకయ్య, సిఎం చంద్రబాబులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి
  • ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదాను ఇస్తామని ..ఇప్పుడు ఆ హామీని విస్మరించారు
  • ప్రత్యేక హోదా కోసం ఐదుగురు మరణించారు. పలువురు ఆత్మహత్యలకు పాల్పడినా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కదలిక లేదు
  • ఈ ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే
  • ఈ ముగ్గురు నేతలపై ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 813  పోలీసుస్టేషన్లలో కేసుల పెట్టాం, దీనిపై ఎస్పీ, కమిషనర్లకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు
  • ఐపీసీ 302 కింద ప్రధాని మోదీ,  కేంద్రమంత్రి వెంకయ్య, సీఎం చంద్రబాబులు  శిక్షార్హులు. వారికి చట్టం ప్రకారం 7 నుంచి 10 శిక్ష పడుతుంది
  • ఐపీసీ 307, రాజద్రోహం 118, చీటింగ్ 420 తో వివిధ చట్టాల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి

 

వీటిపై తదుపరి చర్యలు తీసుకోవాలంటూ గవర్నర్ను కాంగ్రెస్ నేతలు కోరారు.


 

మరిన్ని వార్తలు