చెరవేశారు

29 Sep, 2016 02:01 IST|Sakshi
చెరవేశారు

- కాంక్రీట్ జంగిళ్లుగా కూకట్‌పల్లి, ప్రగతి నగర్, నిజాంపేట
- కాసుల కక్కుర్తితో చెరువులను రాసిచ్చేసిన యంత్రాంగం
- ప్రజాప్రతినిధులే సూత్రధారులుగా వేల కోట్ల వ్యాపారం
- ఆనవాళ్లు లేని హైదర్ చెరువు, మాయమైన మైసమ్మ చెరువు
- కబ్జాలకు పాల్పడ్డ ఇద్దరు ఏపీ టీడీపీ ఎమ్మెల్యేలు
- శివారు చెరువుల పరిరక్షణ కోసం కావాలి.. ఓ కిర్లోస్కర్..
 
 గొలుసుకట్టు చెరువులు.. విశాలమైన వరద నీటి కాల్వలు.. భారీ వర్షాలు వచ్చినా ముంపులేని వ్యవస్థ.. ఇదీ మూడు దశాబ్దాల క్రితం కూకట్‌పల్లి పరిసర ప్రాంతాల పరిస్థితి. నాడు పక్కా పల్లెను తలపించిన ఈ ప్రాంతం నేడు కాంక్రీట్ వనంలా మారిపోయింది. నగరం అత్యంత వేగంగా విస్తరిస్తుండటంతో అధికారులు, ప్రజాప్రతినిధుల రియల్ ఎస్టేట్ వ్యాపారానికి చెరువులు, కుంటలు లే అవుట్లుగా మారాయి. పెద్ద మొత్తంలో అపార్ట్‌మెంట్లు వెలిశాయి. దీంతో కూకట్‌పల్లి, నిజాంపేట, ప్రగతినగర్, హైదర్‌నగర్, హెచ్‌ఎంటీ, మూసాపేట, ఆల్విన్ కాలనీ, బోయిన్‌పల్లి ప్రాంతాలకు కొద్దిపాటి వర్షానికే ముంపు బారినపడుతున్నాయి. నిజాంపేట తురక చెరువు పరీవాహ కప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన బండారి లే  అవుట్ జలదిగ్బంధంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. దీనికి బాధ్యత వహించాల్సింది. ఇక్కడ నిర్మాణాలకు అనుమతించిన అధికారులు.. రూ.కోట్ల సంపాదనే లక్ష్యంగా వ్యాపారం చేసిన బిల్డర్లు...వీరికి అండగా నిలిచిన ప్రజాప్రతినిధులేనన్నది వాస్తవం.  కూకట్‌పల్లి పరిసరాల్లో ఒక్క తురక చెరువే కాదు.. అనేక చెరువుల్లో బహుళ అంతస్తుల అపార్ట్‌మెంట్లు, రూ.కోట్ల  ధర పలికే విల్లాల గేటెడ్ కమ్యూనిటీలు విలసిల్లుతున్నాయి.
 - సాక్షి ప్రతినిధి, హైదరాబాద్
 
 అలీతలాబ్ ఆక్రమణ..
 అలీతలాబ్ (హైదర్‌నగర్) చెరువు: 17 ఎకరాలు
 ప్రస్తుతం మిగిలింది: 10 ఎకరాలు. ఆక్రమణలు:
హైదర్‌నగర్ పరిధిలోని రాంనరేశ్‌నగర్ కాలనీ, శ్మశానవాటికతో కొంతమంది కబ్జాచేశారు. .. 172 సర్వే నంబర్‌కు చెందిన కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఫెన్సింగ్ వేశారు. తూమును కబ్జా చేస్తూ ఓ కళాశాల నిర్మాణం చేపట్టింది. ఓ బిల్డర్ దాదాపు రెండు ఎకరాల స్థలంలో అపార్ట్‌మెంట్లను నిర్మించారు.

 అంబీర్‌చెరువు హాంఫట్..
 అంబీర్ చెరువు(ప్రగతి నగర్): 156 ఎకరాలు
 మిగిలింది:
100 ఎకరాలు. ఆక్రమణలు: లేక్‌వ్యూ కాలనీ, శ్రీనివాసనగర్, ప్రగతినగర్ అపార్ట్‌మెంట్లు, నెస్ట్ అపార్ట్‌మెంట్, నిజాంపేటలో విల్లాలు, ఆదిత్యనగర్, కృష్ణవేణినగర్, శ్రీరామ్‌నగర్, తది తర ప్రాంతాలు. కొందరు రాజకీయ నాయకులు ఎకరాలకొద్ది కబ్జాచేసి అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు నిర్మించారు.

 కాముని చెరువు..
 కాముని చెరువు(ఖైత్లాపూర్): 100 ఎకరాలు
 మిగిలింది:
సుమారు 50 ఎకరాలు. ఆక్రమణలు: రెండు మూడు కాలనీలు ఈ చెరువులోనే వెలిశారుు. దీనికితోడు బహుళ అంతస్తుల భవనాల నిర్మాణ సంస్థ చెరువు భూములను చెరపట్టింది. ఎఫ్‌టీఎల్ పరిధిలో భారీగా మట్టి నింపి భూములను కొనుగోలు చేసుకున్నవారు బారికేడ్లను ఏర్పాటు చేశారు.
 
 భీమునికుంట వధ..
 భీమునికుంట(హెచ్‌ఎంటీ శాతవాహన నగర్): 10 ఎకరాలు
 మిగిలింది:
6 ఎకరాలు. ఆక్రమణలు: తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం టీడీపీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ ఐదు ఎకరాలను ప్రైవేట్ భూమిగా చూపిస్తూ ఆక్రమించారు. కొన్ని ప్రైవేట్ నిర్మాణాలు కూడా ఉన్నాయి.

 కూకట్‌పల్లి చెరువు..
 నల్లచెరువు (కూకట్‌పల్లి): 50 ఎకరాలు
 మిగిలింది: 
25 ఎకరాలు. ఆక్రమణలు: రామయ్యనగర్, శేషాద్రినగర్‌తో పాటు కూకట్‌పల్లికి చెందిన పలువురు పెద్దలు ఇక్కడి నిర్మాణాలకు అండగా నిలిచి చెరువు ప్రాంతాన్ని కూడా ఆక్రమించారు.

 ఎల్లమ్మ చెరువు...
 ఎల్లమ్మ చెరువు (ఎల్లమ్మబండ): 46 ఎకరాలు
 మిగిలింది:
30 ఎకరాలు. ఆక్రమణలు: హెచ్‌ఎంటీ శాతావాహన కాలనీ, జయనగర్ కాలనీతోపాటు పలు నిర్మాణాలు వచ్చారుు. ప్రైవేట్ లే అవుట్‌ను కూడా కొందరు చెరువులోనే చూపిస్తున్నారు.

 సున్నంచెరువు
 సున్నంచెరువు (మోతీనగర్): 25 ఎకరాలు
 మిగిలింది:
10 ఎకరాలు. ఆక్రమణలు: సున్నం చెరువులో సైతం పేదల బస్తీల పేరుతో కొందరు ప్లాట్లు చేసి విక్రరుుంచారు.
 
 ఖాజాకుంట..
 ఖాజాకుంట (మెట్రో వెనకాల): 20 ఎకరాలు
 మిగిలింది:
5 ఎకరాలు. ఆక్రమణలు: విజ్ఞాన్‌పురికాలనీతో పాటు పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్లు, సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ నిర్మాణం చేపట్టారు. ఐడియల్‌గా ఉందని, సొంతం చేసుకున్నారు.

 రంగదాముని చెరువు..
 రంగదాముని(ఐడీఎల్) చెరువు: 40 ఎకరాలు
 మిగిలింది:
30 ఎకరాలు. ఆక్రమిత ప్రాంతాలు: ఓ కళాశాలతోపాటు బాలాజీనగర్, వివేక్‌నగర్‌ల వెనుకవైపున చెరువు ఎఫ్‌టీఎల్‌లో ఆక్రమణలు చోటుచేసుకున్నారుు.

 కిందికుంటను నమిలేశారు
 కింది కుంట(హైదర్‌నగర్): 18 ఎకరాలు
 మిగిలింది:
6 ఎకరాలు. ఆక్రమణలు: అల్లాపూర్ సొసైటీతో పాటు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి టీడీపీ ఎమ్మెల్యే వెంక టశివరామరాజు కు చెందిన విల్లాలు కూడా ఈ చెరువు పక్కనే నిర్మించారు.

 బోయిన్ చెరువు..
 బోరుున్ చెరువు (బోరుున్‌పల్లి): 100 ఎకరాలు
 మిగిలింది:
సుమారు 50 ఎకరాలు
 ఆక్రమణలు: ఇక్కడ కాలనీలు, బస్తీలతో పాటు పలు కమర్షియల్ నిర్మాణాలు సైతం వెలిశారుు. ఇక్కడ అధికారంలో ఉన్న నాయకులు ఆధిపత్యం చెలారుుస్తూ చెరువును చెరపట్టిస్తున్నారు.
 
 మైసమ్మ చెరువు ..
 మైసమ్మ చెరువు (మూసాపేట): 100 ఎకరాలు
 మిగిలింది:
దాదాపు 50 ఎకరాలు. ఆక్రమణలు: పట్టా భూము లు ఇళ్ల స్థలాలతో నిండిపోయారుు. ఎలాంటి అనుమతులు లేకుండా పేదల బస్తీల పేరుతో చెరువులోకి చొచ్చుకొచ్చారుు.
 
 కేపీహెచ్‌బీలోని 30 ఎకరాల ముళ్లకత్వ చెరువు.. హైటెక్‌సిటీ బ్రిడ్జి నిర్మాణంతో కుంచించుకుపోరుుంది. ఆల్విన్‌కాలనీలో 6 ఎకరాల్లో ఉండాల్సిన బందంకుంట ప్రస్తుతం ఆచూకీ లేకుండా పోవటం గమనార్హం. అల్విన్ కాలనీలోనే 50 ఎకరాల్లో ఉండాల్సిన పరికి చెరువు రియల్‌ఎస్టేట్ వెంచర్లతో ప్రస్తుతం సుమారుగా 30 ఎకరాలకు మిగిలింది. చుట్టు రెండు మూడు లే అవుట్లు చెరువులోనే వెలిశారుు. దీంతో కొన్ని నిర్మాణాలు కూడా చెరువులోనే ఉన్నారుు.
 
 శ్రీ రక్షణకు చర్యలు చేపట్టాలి
 నాలాల  కబ్జాల తొలగింపు కోసం ఏర్పాటు చేసిన కిర్లోస్కర్ తరహాలోనే.. చెరువులు, కుంటల ఆక్రమణలపై కూడా కిర్లోస్కర్ లాంటి నిపుణుల బృందాన్ని నియమించి వెంటనే చర్యలు చేపట్టాలి. లేనట్లయితే వచ్చే పదేళ్లలో శివారు ప్రాంతాలన్నీ బండారి లే అవుట్‌ను తలపించడం ఖాయం. ముప్పు ఏర్పడిన తర్వాత కంటే, ముందుచూపుతో వ్యవహరించడమే మేలు.     - పద్మనాభరెడ్డి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్

మరిన్ని వార్తలు