అపోలో డేటా హ్యాక్? నెక్ట్స్ లలిత్ మోదీనే!

12 Dec, 2016 20:35 IST|Sakshi
అపోలో డేటా హ్యాక్? నెక్ట్స్ లలిత్ మోదీనే!
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, విజయ్ మాల్యా, ప్రముఖ జర్నలిస్టు బర్కా దత్ ల ట్విట్టర్ అకౌంట్లు, ఈ-మెయిళ్ల సర్వర్లు హ్యాక్ చేసిన లెజియన్ హ్యాకర్ల బృందం తాము అపోలో ఆసుపత్రికి చెందిన సర్వర్లను హ్యాక్ చేసినట్లు పేర్కొన్నారు. వాషింగ్టన్ పోస్టుకు ఇచ్చిన ఓ రహస్య ఇంటర్వూలో వారు ఈ విషయాన్ని వెల్లడించారు. అపోలోకు సంబంధించిన కీలక సమాచారం మొత్తం తమ వద్ద ఉందని చెప్పారు.
 
వారికి లభ్యమైన డేటా వివరాలను బయటపెడితే భారతదేశ ప్రజలు ఆందోళనలకు గురయ్యే అవకాశం ఉంటడంతో వాటిని విడుదల చేయడం లేదని తెలిపారు. భారత్ లోని 40 వేల సర్వర్లకు చెందిన గిగాబైట్ల కొద్దీ సమాచారం తమ వద్ద ఉందని చెప్పారు. అంతేకాకుండా భారత రాజకీయ నాయకుల వ్యక్తిగత సమాచారం కూడా తమ ఉందని పేర్కొన్నారు.
 
త్వరలో ఐపీఎల్ మాజీ అధ్యక్షుడు లలిత్ మోదీకి చెందిన వ్యక్తిగత సమాచారాన్ని విడుదల చేయనున్నట్లు చెప్పారు. బీజేపీ ప్రభుత్వానికి సన్నిహితులైన వారి సమాచారాన్ని కూడా హ్యాక్ చేసినట్లు వెల్లడించారు.
మరిన్ని వార్తలు