ఆపిల్ చేతికి హైదరాబాద్ కంపెనీ

23 Sep, 2016 11:41 IST|Sakshi
ఆపిల్ చేతికి హైదరాబాద్ కంపెనీ

హైదరాబాద్ :  టెక్ దిగ్గజం ఆపిల్  మరో స్టార్ట్ అప్ కంపెనీని  సొంతం చేసుకుంది.  హైదరాబాద్ ఆధారిత మెషీన్ లెర్నింగ్ సాఫ్ట్  వేర్  కంపెనీ  'తుప్ల్ జంప్'  ను కొనుగోలు చేసింది. రోహిత్ రాయ్ ,బుద్ధవరపు సత్య ప్రకాష్, దీపిక్  సహ వ్యవస్థాపకులుగా 2013లో  ప్రారంభించారు.   యూనిక్ సాఫ్ట్ వేర్ ద్వారా  పెద్దమొత్తంలో కంపెనీల డాటాను  స్టోర్, ప్రాసెస్ , విజువలైజ్ తదితర అంశాల్లో విశేషమైన సేవలు అందిస్తోందని  టెక్ క్రంచ్ నివేదించింది.  అపాచీ  స్పార్క్ ప్రాసెసింగ్  ఇంజిన్, అపాచీ కాసాండ్రా,  ఎన్ ఓఎస్ క్యూఎల్ డేటాబేస్  లాంటి ఓపెన్ సోర్స్ డేటా టూల్స్ లో మంచి ప్రవేశ ముందని  వెంచురీ బీట్  వ్యాఖ్యానించింది.  మరోవైపు రోహిత్ రాయ్, సత్యప్రకాష్ ఇప్పటికే ఇద్దరూ ఆపిల్ లో  జాయిన్ కాగా,  మూడవ  సహ వ్యవస్థాపకుడు దీపక్ ఆలూరు అనప్లాన్ లో చేరారు.


ఆపిల్  తన టెక్ సేవల విస్తరణ లోభాగంగా  చిన్న టెక్నాలజీ  కంపెనీలను కొనుగోలు చేస్తోందని  టెక్ క్రంచ్ రిపోర్ట్ చేసింది. మరోవైపు ఈ వార్తలతో  తుప్ల్  కంపెనీ వెబ్ సూట్  మూతబడింది. ఈ వార్తలపై మరిన్ని వెల్లడి కావాల్సి ఉంది.  

 

మరిన్ని వార్తలు