పుంజుకుంటున్న యాపిల్

27 Jul, 2016 10:28 IST|Sakshi
పుంజుకుంటున్న యాపిల్

ప్రపంచ వ్యాప్తంగా తన ప్రాభవం కోల్పోతూ  ఒబ్బందులు పడుతున్న ప్రముఖ  టెక్ దిగ్గజం యాపిల్ కు కాస్త ఊరట లభించినట్టే కనిపిస్తోంది.  అవును .. జూన్ తో ముగిసిన త్రైమాసికంలో అంచనాలకు మించి యాపిల్ ఆదాయంలో రాణించింది. ప్రధానంగా యాపిల్ ప్రధాన ఉత్పత్తి అయిన ఐ ఫోన్ అమ్మకాలు  కూడా  నిపుణలు అంచనాలకు అందకుండాపోయాయి.  క్వార్టర్ 3  లో యాపిల్ ఐ-ఫోన్‌  సేల్స్ భారీగా  పెరిగాయట. వాల్‌ స్ట్రీట్‌ పండితులు సైతం ఊహించలేని  స్థాయిలో  విక్రయాలను నమోదు చేసింది.  దాదాపు 40.4 మిలియన్ ఐ ఫోన్ల  అమ్మకాలు జరిగినట్టు నివేదికలు తెలిపాయి. గత ఏడాది ఇదే త్రైమాసికంలో తో పోలిస్తే 15 శాతం క్షీణించినప్పటికీ ఎనలిస్టుల అంచనాలను మించి అమ్మకాలు సాగించిందని ఈ పరిశోధన సంస్థ  వివరించింది. యాపిల్  త్రైమాసిక నికర లాభం, 27 శాతం తగ్గి  7.8 బిలియన్ డాలర్లకు పడిపోయింది.  

అలాగే నికర ఆదాయం 42.36 బిలియన్ డాలర్లుగా నమోదు చేసింది. అయితే   విశ్లేషకులుయాపిల్  ఆదాయాన్ని 42. 09 బిలియన్  డాలర్లుగా అంచనావేశారు. దీంతో మంగళవారం నష్టాలతో ముగిసిన యాపిల్ షేర్ బుధవారం  ఓపెనింగ్ లోనే 7శాతం లాభాలను నమోదు చేసింది. యాప్ స్టోర్, ఐక్లౌడ్ తమకు మంచి ఫలితాలిచ్చిందని చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ లుకా మాస్ట్రీ తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఐఫోన్ 6  అమ్మకాలు బ్లాక్ బ్లస్టర్గా  నిలిచాయన్నారు.  ఈ ఏడాది విడుదల చేసిన చవకైన 10సెం.మీ ఐ ఫోన్ ఎస్ఈ  కొనుగోలుదారుల స్థాయిని విస్తరించిందని యాపిల్ సీఈవో టిమ్ కుక్ తెలిపారు.

అయితే సంస్థకు చైనా ప్రధాన నిరుత్సాహపరిచేదిగా ఉందని  మూర్ ఇన్సైట్స్ అండ్ స్ట్రాటజీ  విశ్లేషకుడు పాట్రిక్ మోర్హెడ్ చెప్పారు.  తాము  ఊహించిన దాని కంటే  మెరుగైన ఫలితాలుసాధించిందని కస్టమర్ డిమాండ్ కూడా అంచనాలను మించిందని  పేర్కొంది.  2007 లో గాడ్జెట్ విడుదల నుంచి మొదటిసారి పడిపోయిందనీ, ఐఫోన్  అమ్మకాలు గత త్రైమాసికంలో 16.3 శాతం  క్షీణించాయని తెలిపింది. కాగా చైనాలో  ఐ ఫోన్ అమ్మకాలపై  నిషేధం యాపిల్ కు పెద్ద దెబ్బ. అసలే కష్టాల్లో ఉన్న సంస్థపై ఇది మరింత ప్రభావాన్ని చూపింది. అయితే అక్కడి రెగ్యులేటరీ సంస్థతో చర్చలు జరుపుతున్నామని సంస్థ తెలిపింది. యాపిల్ ఐ ఫోన్ అమ్మకాలు ఇండియా ప్రధాన మార్కెట్ గా నిలిచి  దాదాపు 51 శాతం వృద్ధిని నమోదు చేసింది. చైనాలో 33.2 క్షీణతను నమోదు చేసింది.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు