శాంసంగ్కు మరో ఎదురు దెబ్బ

8 Oct, 2016 11:54 IST|Sakshi
శాంసంగ్కు మరో ఎదురు దెబ్బ

వాషింగ్టన్: ఆపిల్ ఐ ఫోన్ 7 లాంచింగ్ ఆనందంలో ఉన్న ప్రముఖ స్మార్ట్ ఫోన్ మేకర్ ఆపిల్ కు మరో  సంతోషం వచ్చి వరించింది.  మరో మొబైల్ దిగ్గజం, దక్షిణ కొరియా స్మార్ట్ ఫోన్ మేకర్ శాంసంగ్ పై పైచేయి సాధించింది.సుమారు 800 కోట్ల (119.6 మిలియన్ డాలర్ల)  రూపాయల పరిహారం కోసం దాఖలైన కేసులో ఆపిల్  కు అనుకులంగా  అమెరికా  ఫెడరల్ కోర్టు తీర్పు ఇచ్చింది.  ఆపిల్ పేటెంట్లను శాంసంగ్ అక్రమంగా వాడుకుందని గణనీయమైన ఆధారాలు లేవన్నగత జ్యూరీ తీర్పును  ఫెడరల్ సర్క్యూట్ అప్పీల్స్   శుక్రవారం  తోసి పుచ్చింది.   శాంసంగ్ కు విధించిన జరిమానాను పునరుద్ధరించింది.   ఈ తాజా తీర్పుతో స్మార్ట్ ఫోన్ దిగ్గజాలు యాపిల్, శాంసంగ్ పేటెంట్ హక్కుల కేసులో మరో  ట్విస్ట్  ఏర్పడింది.  అసలే గెలాక్సీ నోట్ 7పేలుళ్ల ప్రమాదాలు, రీకాల్ తదితర వ్యవహారాలతో ఇబ్బందుల్లో ఉన్న శాంసంగ్  కు మరో ఎదురు దెబ్బ తప్పలేదు.

క్విక్ లింక్స్ తో పాటు ఐఫోన్ 'సైడ్  టు అన్ లాక్', ఆటో కరెక్ట్ ఫీచర్స్ ఆప్షన్స్ లో శాంసంగ్ తమ పేటేంట్ రైట్స్ ను ఉల్లంఘించిందని ఆరోపించిన   కేసులో ఇటీవలి తీర్పును  రద్దు చేసిన ఫెడరల్ కోర్టు ఆపిల్  వాదనను సమర్ధించింది. 119.6మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఇది ఆపిల్ కు గొప్ప విజయమని రిచ్మండ్ స్కూల్ విశ్వవిద్యాలయ  ప్రొఫెసర్ జేమ్స్ గిబ్సన్ వ్యాఖ్యానించారు. మరోవైపు ఈ తాజా తీర్పుపై  టెక్ దిగ్గజాలు రెండూ ఇంకా  స్పందించలేదు.

ఆపిల్, శాంసంగ్  మధ్య పేటెంట్ హక్కుల విషయంలో గత కొన్నేళ్లుగా  లీగల్ ఫైట్ నడుస్తోంది.  దాదాపు 12 దేశాల్లో వివాదాలు నడుస్తున్నాయి. ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్, టాబ్లెట్ ఉత్పత్తుల్లో  పేటెంట్ హక్కులను ఉల్లంఘించినట్టు పరస్పరం ఆరోపించుకుంటున్న సంగతి  తెలిసిందే.
 

మరిన్ని వార్తలు