ఖతర్‌పై అరబ్‌ దేశాల మండిపాటు

7 Jul, 2017 23:50 IST|Sakshi
ఖతర్‌పై అరబ్‌ దేశాల మండిపాటు

రియాద్‌: సౌదీ అరేబియా, దాని మిత్ర దేశాలు ఖతర్‌ మొండి వైఖరిపై మండిపడ్డాయి. తమ డిమాండ్లను ఖతర్‌ ఒప్పుకోకపోవడంతో ఆ దేశంపై గుర్రుగా ఉన్నాయి. అరబ్‌ దేశాల్లో శాంతిభద్రతలను దెబ్బతీయడమే తన లక్ష్యంగా ఖతర్‌  పెట్టుకుందని ఆరోపిస్తున్నాయి. సౌదీ అరేబియా, ఈజిప్ట్, యూఏఈ, బహ్రెయిన్‌ లాంటి అరబ్‌ దేశాలు.. ఖతర్‌తో దౌత్య, ఆర్థిక, బౌగోళిక సంబంధాలను తెంచుకోవడం తెలిసిందే.

గత నెలలో అల్‌జజీరా చానల్‌ మూసివేత, టర్కీ సాయుధ దళాల తొలగింపు, ఇరాన్‌తో బంధాలను తెంచుకోవడం, ఐసిస్, అల్‌కాయిదా వంటి పలు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలను తెంచుకోవడం వంటి 13 డిమాండ్లను అంగీకరించాలని ఖతర్‌ను కోరాయి. ఈ మేరకు ఇచ్చిన గడువు కూడా ముగిసిన నేపథ్యంలో అరబ్‌దేశాలు ఖతర్‌పై విరుచుకుపడుతున్నాయి.

మరిన్ని వార్తలు