25 కేజీల పురాతన బంగారం పట్టివేత

18 Mar, 2015 09:34 IST|Sakshi
25 కేజీల పురాతన బంగారం పట్టివేత

బ్యూనస్ ఎయిర్స్: పురాతన కాలానికి చెందిన బంగారాన్ని భారీ ఎత్తున దేశం నుంచి అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను పోలీసు ఉన్నతాధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 25 కేజీల బంగారపు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన అర్జంటైనాలో మంగళవారం చోటు చేసుకుంది. అదుపులోకి తీసుకున్న వ్యక్తులు అర్జంటైనాలో నివసిస్తున్న పెరుగ్వే దేశానికి చెందిన వారని పోలీసులు వెల్లడించారు.

ట్రక్లో ప్రయాణికుల సిట్ కింద పెట్టి ఈ బంగారాన్ని తరలిస్తున్న క్రమంలో సరిహద్దులో పోలీసులు ఎప్పటిలాగా తనిఖీలు నిర్వహించారు. ఆ క్రమంలో పోలీసులు అడిగిన ప్రశ్నలకు నిందితుల్లో ఒకరు కంగారు పడుతు సమాధానం ఇవ్వడంతో పోలీసులు ట్రక్ను స్కాన్ చేశారు. దాంతో సీట్ కింద భారీ ఎత్తున బంగారం కడ్డీలు కనుగొన్నారు.

బంగారం స్వాధీనం చేసుకుని పరీక్షించగా వాటిపై సెంట్రల్ బ్యాంకు ఆఫ్ పెరుగ్వే 1824 అని ముద్రితమై ఉందని పోలీసులు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ. 2.27 మిలియన్ అమెరికన్ డాలర్లు ఉంటుందని చెప్పారు. వీటితో పాటు కేజీ బంగారం కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు