అమెరికా డాక్టర్పై భారత బ్రిగెడియర్ అత్యాచారం!!

7 Aug, 2014 13:59 IST|Sakshi

అమెరికాలో ఒక వైద్యురాలిపై అత్యాచారం చేసిన కేసులో భారత ఆర్మీ బ్రిగెడియర్పై విచారణ మొదలైంది. ప్రస్తుతం ఆర్మీ వార్ కాలేజిలో పనిచేస్తున్న బ్రిగెడియర్ మనోజ్ తివారీపై 'కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ' మొదలుపెట్టారు. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత మిషన్కు మిలటరీ అటాచీగా ఉన్న సమయంలో న్యూయార్క్ నగరానికి చెందిన ఓ వైద్యురాలిపై అత్యాచారం చేసినట్లు ఆయనపై ఆరో్పణలు వచ్చాయి. ఆమె వైద్యురాలిగా ఉండి, తర్వాత వ్యాపారవేత్తగా మారారు. అప్పటికి కర్నల్గా ఉన్న తివారీ, తనకు పెళ్లి కాలేదని చెప్పి, ఆమెకు డ్రగ్స్ ఇచ్చి ఆ తర్వాత తన కార్యాలయంలోనే ఆమెపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఆ తర్వాతి కాలంలో భారతదేశానికి తిరిగొచ్చిన తివారీకి బ్రిగెడియర్గా ప్రమోషన్ లభించింది. అప్పటికి భారత సైన్యానికి ఇంకా అత్యాచారం ఫిర్యాదు అందలేదు. తనను పెళ్లి చేసుకుంటానని అతడు మాట ఇచ్చాడని, సంఘటన గురించి ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించారని ఆమె ఆరోపించారు.

మరిన్ని వార్తలు