'దేశంలో 5 కోట్ల మంది మానసిక రోగులు'

24 Jul, 2015 17:40 IST|Sakshi
'దేశంలో 5 కోట్ల మంది మానసిక రోగులు'

మన దేశంలో దాదాపు 5 కోట్ల మంది డిప్రెషన్, యాంగ్జయిటీ లాంటి మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. గత సంవత్సరం ఏడు వేల మందికి పైగా ఇలాంటి సమస్యలతోనే ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. 2005లో అయితే కోటి - రెండు కోట్ల మంది మాత్రమే స్కిజోఫ్రేనియా, బైపోలార్ డిజార్డర్ లాంటి మానసిక సమస్యలతో బాధపడేవారని జాతీయ మాక్రో ఎకనమిక్స్ కమిషన్ తెలిపింది. ఈ విషయాలను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నద్దా లోక్సభకు తెలిపారు.

మానసిక సమస్యలతో ఆత్మహత్యలు చేసుకున్నవాళ్లు 2012లో 7,769 మంది, 2013లో 8,006 మంది, 2014లో 7,104 మంది ఉన్నారు. దేశంలో మొత్తం 3,800 మంది సైకియాట్రిస్టులు, 898 మంది క్లినికల్ సైకాలజిస్టులు, 850 మంది సైకియాట్రిక్ సోషల్ వర్కర్లు, 1,500 మంది సైకియాట్రిక్ నర్సులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే 3 ఆరోగ్య సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వరంలో నడిచేవి 40 ఆస్పత్రులు, వివిధ వైద్యకళాశాలల్లో 398 మానసిక వైద్య విభాగాలు ఉన్నాయి. వీటన్నింటిలో మానసిక రోగులకు చికిత్సలు అందిస్తున్నారు.

మరిన్ని వార్తలు