ఆ ఇంట్లో ఆయుధాల తయారీ మెషీన్!

29 Aug, 2016 16:39 IST|Sakshi

రాయ్ పూర్: అక్రమంగా ఆయుధాలను నిల్వ చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. హోమియోపతి డాక్టర్ గా సేవలందిస్తున్న డా.అనిరుద్ధ చటర్జీ పెద్ద ఎత్తున ఆయుధాలను దాచిపెట్టినట్లు సమాచారం అందుకున్న రాయ్ పూర్ పోలీసులు  సోమవారం అతడి ఇంటిపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో చటర్జీ ఇంటిలోని మూడో అంతస్తులో పెద్ద ఎత్తున ఉంచిన బాణాలు, కత్తులు, తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.

రెండు రోజుల క్రితం అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తి నుంచి పోలీసులు ఓ తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. అతను ఇచ్చిన సమాచారంతో చటర్జీ ఇంటిపై దాడి చేసిన పోలీసులు ఆయుధాలు తయారుచేసే మెషీన్ ను గుర్తించినట్లు సమాచారం. చటర్జీకి మావోయిస్టులతో ఏవైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు