ఈశాన్య ప్రజల భద్రతపై కమిటీ

6 Feb, 2014 11:41 IST|Sakshi
మృతి చెందిన విద్యార్థి నిడో తానియా

హస్తినలో అరుణాచల్ ప్రదేశ్ విద్యార్థి నిడో తానియా మృతి చెందడంతో ఈశాన్య రాష్ట్రాల ప్రజల భద్రతపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈశాన్య రాష్ట్రాలలోని ప్రజల భద్రతపై అధ్యాయనానికి విశ్రాంత ఐఏఎస్ అధికారి బెజ్బారువా నేతృత్వం ఓ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రభుత్వం గురువారం ప్రకటించింది. ఆ కమిటీలో ఆరుగురు సభ్యులు ఉంటారని తెలిపింది. రెండు నెలలో ఆ కమిటీ నివేదిక అందజేస్తుందని వెల్లడించింది. కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేతో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతోపాటు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఎంపీలు గురువారం ఉదయం న్యూఢిల్లీలో సమావేశమైయ్యారు.

 

ఆ సమావేశం జరిగిన కొద్ది నిముషాలకే ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. గత గురువారం దేశరాజధానిలోని లజ్పత్ నగర్ మార్కెట్లో నిడో తానియాతో కొంత మంది యువకులు ఘర్షణ పడ్డారు. ఆ మరుసటి రోజున నిడో తానియా మృతి చెందాడు. దాంతో ఢిల్లీలో ఈశాన్య రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తు ఆందోళనకు దిగారు.  తానియా మృతిపై ఇటు విపక్షాలు అటు స్వపక్షంలోని సభ్యులు నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమైనాయి. అందులోభాగంగా నిన్న ప్రారంభమైన లోక్సభ నిడో తానియా మృతిని ఖండించింది. ఆ ఘటన తీవ్ర దురదృష్టకరమైనదిగా స్పీకర్ మీరా కుమార్ అభివర్ణించారు.



తానియా మృతికి కారుకులైన వారిపై చర్యలు తీసుకోవాలని సభలో వామపక్షాలు డిమాండ్ చేశాయి. తానియా మృతిని ఢిల్లీ హైకోర్టు సూమోటుగా స్వీకరించి విచారణ జరుపుతుంది.  నిడో మరణంపై న్యాయదర్యాప్తునకు కూడా ఆ హోం మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ, షిండే ఈశాన్య ప్రాంత ఎంపీలతో సమావేశమైయ్యారు.

మరిన్ని వార్తలు