అశోక్ లేలాండ్కు భారీ ఆర్డర్

20 Oct, 2016 17:13 IST|Sakshi
అశోక్ లేలాండ్కు భారీ ఆర్డర్

ముంబై: ఆటోమొబైల్ రంగంలోని అగ్రశ్రేణి సంస్థల్లో ఒకటైన అశోక్ లేలాండ్  భారీ ఆర్డర్ ను చేజిక్కించుకుంది. టాంజానియా ప్రభుత్వం నుంచి 170 మిలియన్  డాలర్లు సుమారు రూ 1,130.96 కోట్ల  విలువైన ఆర్డర్ ను దక్కించుకుంది. అశోక్ లేలాండ్  వాహనాలు, జెన్ సెట్స్,  విడిభాగాలు తదితర   వర్క్ షాప్  కవసరమైన  పరికరాలు, ట్రైయినింగ్ మాడ్యూల్స్ సరఫరా కోసం ఈ ఒప్పందం కుదుర్చుకుంది.
టాంజానియా యునైటెడ్ రిపబ్లిక్ ప్రభుత్వం నుంచి తమ వాహనాలు, విడిభాగాలు , అంబులెన్స్ పరికరాల కొనుగోలు కోసం  భారీ ఆర్డర్ ను సాధించినట్టు గురువాం  బీఎస్ఈ ఫైలింగ్ లో  తెలిపింది. 

ప్రముఖ అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతులద్వారా గ్లోబల్ గా విస్తరించాలన్న  అశోక్ లేలాండ్ వ్యూహంలో భాగంగా ఈ ఒప్పందమని అశోక్ లేలాండ్ మేనేజింగ్ డైరెక్టర్ వినోద్ కె దాసరి ఒక ప్రకటనలో తెలిపారు . ఈ ప్రకటనలో ఇవాల్టి మార్కెట్  అశోక్ లేలాండ్ సుమారు 2శాతం లాభపడింది. తాజా ఆర్డర్ నేషనల్ ఎగుమతి భీమా ఖాతా(ఎన్ఈఐఎ)  పథకంలో భాగంగా  ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పూర్తిగా ఫైనాన్స్ చేసింది.
 

మరిన్ని వార్తలు