అశోక్ లేలాండ్‌లో వీఆర్‌ఎస్

9 Nov, 2013 02:33 IST|Sakshi

న్యూఢిల్లీ: అశోక్ లేలాండ్ కంపెనీ తన సిబ్బందికి స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్‌ఎస్) స్కీమ్‌ను శుక్రవారం ప్రకటించింది. మందగమనం కొనసాగుతుండటంతో సిబ్బంది వ్యయాలను తగ్గించుకోవడంలో భాగంగా వీఆర్‌ఎస్‌ను ప్రకటించామని హిందూజా గ్రూప్ ప్రధాన కంపెనీ అశోక్ లేలాండ్ పేర్కొంది. గత క్వార్టర్‌లో తమ మార్కెట్ వాటా నిలుపుకోగలిగామని, కానీ అమ్మకాలు తగ్గాయని కంపెనీ ఎండీ వినోద్ కె. దాసరి చెప్పారు. వీఆర్‌ఎస్ తీసుకోవాలనుకునే ఉద్యోగులకు న్యాయమైన, సరైన పరిహారమిస్తామన్నారు. అయితే వీఆర్‌ఎస్‌కు సంబంధించి విధి, విధానాలు, నిబంధనలు, గడువు తదితర వివరాలను వెల్లడించలేదు.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా