అశ్విని నాచప్ప పర్సు మాయం

4 Dec, 2013 01:04 IST|Sakshi
అశ్విని నాచప్ప పర్సు మాయం

బెంగళూరు, న్యూస్‌లైన్: పరుగుల రాణి అశ్విని నాచప్ప పర్సును ఓ దుండగుడు మాయం చేశాడు. అందులోని రెండు ఏటీఎం కార్డులను ఉపయోగించి రూ.1.70 లక్షలు డ్రా చేసుకున్నాడు. ఈ ఘటనపై అశ్విని మంగళవారం స్థానిక జయనగర పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదు మేరకు.. గత శనివారం బెంగళూరులోని ఓ పాఠశాల నిర్వహించిన వార్షిక క్రీడోత్సవాలకు అశ్విని ముఖ్య అతిథిగా వెళ్లారు. ఆ సందర్భంలో ఆమె వేదికపై ఉంచిన పర్సు చోరీకి గురైంది. దానిలోని 2 ఏటీఎం కార్డులను ఉపయోగించిన దుండగుడు రూ. 1.70 లక్షలు డ్రా చేశాడు. అశ్వినికి తెలిసిన వారే ఈ చోరీ చేసి ఉంటారని, పిన్ నంబర్ కూడా తెలిసి ఉండడంతోనే నగదునూ డ్రా చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.
 

మరిన్ని వార్తలు