టాప్ హీరోలు!

21 May, 2016 02:32 IST|Sakshi
టాప్ హీరోలు!

సాక్షి, చెన్నై: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో టాప్ హీరోలుగా ఈ సారి కొందరే నిలిచారు. ఓట్ల చీలికతో ఈ సారి టాపర్ల సంఖ్య తక్కువే. గతంలో యాైభై, డెబ్బై, లక్షా అంటూ మెజారిటీల్ని దక్కించుకున్న వాళ్లు కూడా ఈ సారి పది, ఇరవై, ముప్పైలోపు పరిమితం కావాల్సి వచ్చింది. ఇందులో సీఎం జయలలిత, డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్‌లు కూడా ఉన్నారు. ఇక, తామే హీరోలం అన్నట్టుగా డీఎంకే, అన్నాడీఎంకేలకు చెందిన పలువురు నలబై నుంచి డెబ్బై వేలలోపు ఓట్లతో టాప్ హీరోలుగా నిలిచారు. ఈ హీరోల్లో ప్రప్రథముడిగా తొమ్మిది పదుల వయస్సు దాటి పదమూడో సారి అసెంబ్లీలో అడుగు పెట్టనున్న డీఎంకే అధినేత కరుణానిధి ఉన్నారు.

కరుణానిధికి 68,366 ఓట్ల మెజారిటీ దక్కింది.  తదుపరి ఒట్టన్ చత్రం నుంచి డిఎంకే తరపున ఎన్నికైన చక్రపాణి 65 వేల 711 ఓట్ల మెజారిటీ దక్కించుకున్నారు.  తిరువణ్ణామలై నుంచి డిఎంకే తరపున ఎన్నికైన ఏవివేలు 50 వే ల 348, తిరుక్కోవిలూరు నుంచి డీఎంకే తరఫున పొన్ముడి 41,057 ఓట్ల మెజారిటీ పొందారు. తిరుపత్తూరు నుంచి డీఎంకే తరఫున ఎన్నికైన పెరియకరుప్పన్ 42004 ఓట్ల మెజారిటీ సాధించారు. ఇక, అన్నాడీఎంకే అధినేత్రి జె జయలలిత కన్నా, ఆ పార్టీకి చెందిన పలువురు మంత్రులు యాభై వేలకు పైగా మెజారిటీ సాధించడం విశేషం. ఇందులో మాజీ ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి పన్నీరు సెల్వం,  బోడి నాయకనూర్ నుంచి 53 వేల 107 ఓట్ల మెజారిటీతో గెలిచారు. మరో మంత్రి ఎస్‌పి వేలుమణి  తొండాముత్తురులో 64,041 ఓట్ల మెజారిటీ,  ఇంకో మంత్రి తంగమణి కుమర పాళయం నుంచి 47 వేల 329, ఎడపాడి నుంచి మంత్రి ఎడపాడి కె. పళని స్వామి 42,022 ఓట్ల మెజారిటీతో టాప్ హీరోలుగా అయ్యారు.
 
ఘోరం: అత్యధిక మెజారిటీతో హీరోలుగా కొందరు అవతరిస్తే, మరి కొందరు హీరోలు అత్యధిక ఓట్ల మెజారిటీ తేడాతో ఘోర పరాజయాన్ని చవి చూశారు. ఇందులో తొలి నేతగా డీఎండీకే అధినేత, ప్రజా సంక్షేమ కూటమి సీఎం అభ్యర్థి  విజయకాంత్ నిలిచారు. ఆయన 47, 526 ఓట్లతో అన్నాడీఎంకే అభ్యర్థి కుమర గురు చేతిలో ఘోర  పరాజయాన్ని చవిచూశారు. తదుపరి పీఎంకే సీఎం అభ్యర్థి 18,446 వేలతో ఓటమి ఎదు చవి చూడాల్సి వచ్చింది.

>
మరిన్ని వార్తలు