మక్కాలో మరో పెను విషాదం

24 Sep, 2015 15:34 IST|Sakshi
మక్కాలో మరో పెను విషాదం

మక్కా : మక్కాలో గురువారం మరో పెను విషాదం చోటుచేసుకుంది. పవిత్ర హజ్ యాత్రలో తొక్కిసలాట జరిగి సుమారు 310మంది హజ్ యాత్రికులు దుర్మరణం చెందారు. మరో 500మందికి పైగా గాయపడ్డారు.  సైతాన్ను రాళ్లతో కొట్టేందుకు యాత్రికులు ఒక్కసారిగా ఎగబడటంతో ఈ దుర్ఘటన జరింది.  15 రోజుల వ్యవధిలో ఇది రెండో సంఘటన.  కాగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  చనిపోయినవారిలో వివిధ దేశాలకు చెందినవారుగా ఉన్నారు. గతంలో మక్కాలో మసీదు మరమ్మతుల సందర్భంగా భారీ క్రేన్ కూలి 107 మంది చనిపోయిన విషయం తెలిసిందే.

కాగా పవిత్ర హజ్ యాత్ర సందర్భంగా ముస్లింలు పోటెత్తారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా నిన్న ఒక్కరోజే లక్షలమంది ముస్లింలు హజ్‌లో పాల్గొన్నారు. హజ్‌ యాత్రలో అయిదు రోజులను ముఖ్యమైనవిగా పేర్కొంటారు. ఇందులో భాగంగా అర్ఫా మైదాన్‌లో నిర్వహించే ప్రత్యేక ప్రార్థనలకు ముస్లింలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. దాదాపు 25 లక్షల మందికి పైగా ముస్లింలు ఇందులో పాల్గొన్నారు. లెక్కకు మించి భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది.




 

మరిన్ని వార్తలు