కస్టడీ కాదు మరణ మృదంగం

19 Dec, 2016 11:45 IST|Sakshi
విచారణ పేరుతో వ్యక్తిని అదుపులోకి తీసుకుని.. సహకరించడం లేదని చిత్ర వధలు చేయడంపై మానవ హక్కుల కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. 2010 నుంచి 2016 వరకూ దేశవ్యాప్తంగా 591 మంది పోలీసు కస్టడీలో మరణించారని పేర్కొంది. గత ఏడాది కాలంలో ఈ సంఖ్య 97గా ఉందని చెప్పింది. విచారణలో ఉన్న వ్యక్తి మరణం వల్ల కేసులు ఎదుర్కొంటున్న పోలీసు అధికారుల సంఖ్య మరణించిన వారికి మూడింతలు తక్కువగా ఉందని వెల్లడించింది.
 
కస్టడీలోకి తీసుకున్నవారిని 24 గంటల్లోగా మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చాల్సివుండగా కొంత మంది పోలీసు అధికారులు అలా చేయడం లేదని అంది. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని మానవహక్కులను కాలరాస్తున్నారని ఘాటుగా విమర్శించింది. కస్టడీలో మరణిస్తున్నవారిలో ఎక్కువ మంది మేజిస్ట్రేటు ముందు హాజరుపరచని వారేనని తెలిపింది.
 
అంతర్జాతీయ మానవ హక్కుల సంస్ధలు బాధిత కుటుంబాలతో చేసిన ఇంటర్వూల్లో విషాదకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయని చెప్పింది. కస్టడీలోకి తీసుకున్న వారిని చట్ట ప్రకారం కాకుండా అమానవీయంగా ప్రవర్తిస్తూ దారుణంగా హింసించేవారని చెప్పినట్లు తెలిపింది.
 
>
మరిన్ని వార్తలు