ఏకంగా ఏటీఎంనే ఎత్తుకెళ్లారు!

14 May, 2014 21:58 IST|Sakshi
ఏకంగా ఏటీఎంనే ఎత్తుకెళ్లారు!
హిస్సార్: ఏటీఎం మిషన్ ను పగలగొట్టి డబ్బులు ఎత్తుకెళ్లడం లాంటి తరచుగా వార్తల్లో వింటుంటాం. కాని ఏకంగా ఏటిఎంనే మాయం చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన హర్యానా హిస్సార్ లో మోడల్ టౌన్ మార్కెట్ లో జరిగింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఏటీఎం ను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని పోలీసులు తెలిపారు.
 
ఈ ఏటిఎంకి కాపలాగా సెక్యూరిటీ సిబ్బంది లేరని, సీసీటీవీ కెమెరా అమర్చలేదని పోలీసులు తెలిపారు. పక్కా ప్లాన్ ప్రకారమే ఏటీఎంను దొంగిలించారని పోలీసులు వెల్లడించారు. నిందితులను పట్టుకునేందుకు ఫోరెన్సిక్ లాబరేటరీ నిపుణులు రంగంలోకి దిగారు. చేతి గుర్తుల ఆధారంగా దొంగల్ని పట్టుకునేందుకు ఫోరెన్సిక్ నిపుణుల ప్రయత్నాలు ప్రారంభించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
 
Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు