వాణిజ్య ఒప్పందాలపై ఆసియా దేశాల కసరత్తు

1 Aug, 2013 08:12 IST|Sakshi
Anand Sharma

న్యూఢిల్లీ: ఆసియా పసిఫిక్‌లో స్వేచ్ఛా వాణిజ్య ప్రాంతం (ఎఫ్‌టీఏఏపీ) ఏర్పాటు దిశగా మరిన్ని కొత్త స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవాలని, ప్రస్తుత ఒప్పందాలను బలోపేతం చే యాలని ఆసియా దేశాల వ్యాపార దిగ్గజాలు తీర్మానించారు. ఈ తరహా ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాల వల్ల ఆసియా ప్రాంత దేశాల మధ్య పరస్పర సహకారం మరింతగా పెరగగలదని అభిప్రాయపడ్డారు. వస్తు సేవలు వాణిజ్యం మెరుగుపడటం, సీమాంతర పెట్టుబడులు పెరగడం, టారిఫ్‌యేతర అడ్డంకులు తొలగిపోవడం వంటి సానుకూల పరిస్థితులు నెలకొనగలవని పేర్కొన్నారు. సీఐఐ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన నాలుగవ ఆసియన్ బిజినెస్ సదస్సు సందర్భంగా ఈ మేరకు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

మరిన్ని వార్తలు