3వేల ఇంజనీర్ కొలువులు

3 Sep, 2016 12:46 IST|Sakshi
3వేల ఇంజనీర్ కొలువులు

బెంగళూరు: ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ, ఆటో విడిభాగాలు తయారు చేసే కంపెనీ  దేశంలో భారీ ఎత్తున ఇంజనీర్లను నియమించుకోనున్నట్టు శుక్రవారం ప్రకటించింది. ఈ సంవత్సరం లో 3,000 మంది ఇంజనీర్లను నియమించుకోనున్నట్టు తెలిపింది. భవిష్యత్తులో  చాలా వేగంగా తాము అభివృద్ధి చెందుతున్నామని ఈ క్రమంలోనే ఈ నియామకాలని బోష్ గ్రూప్  ఇండియా, అధ్యక్షుడు, మేనేజింగ్ డైరెక్టర్  స్టీఫెన్ బెర్న్స్ చెప్పారు.  అడుగొడిలో కొత్తగా ప్రారంభించిన రెండు భవనాల్లో  ఇంజనీరింగ్ అండ్ బిజినెస్ సొల్యూషన్స్ , బోష్ గృహోపకరణాలు కేంద్రంలో  సుమారు 3 వేల మంది ఉద్యోగులు అవసరమని తెలిపింది.

కర్ణాటక రాష్ట్రంలో  తమ విస్తరణ ప్లాంట్ లోని మొదటి భాగాన్ని ప్రారంభించిన సంస్థ ఈ విషయాలను వెల్లడించింది.  రాష్ట్ర మధ్య భారీ పరిశ్రమల శాఖా మంత్రి ఆర్ .వి. దేశ పాండే, రవాణామంత్రి రామలింగారెడ్డి  సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మొదటి దశ విస్తరణలో భాగంగా రూ .350 కోట్ల పెట్టుబడులతో   2014 టెక్నాలజీ డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటు చేశామని  పేర్కొంది.  రెండవ దశలో 2016 సంవత్సరానికి గాను మరో రూ. 1,170  కోట్లను ఇన్వెస్ట్ చేయనున్నట్టు బోష్  ఆసియా- పసిఫిక్  అధికారి పీటర్ టైరోలర్  తెలిపారు.  అడుగోడి ,బెంగళూరు, కోయంబత్తూరులలో తమ కు 14 వేల మంది  రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్  సిబ్బంది వున్నట్టు చెప్పారు.  జర్మనీ తరువాత తమకు భారతే అతిపెద్ద  అభివృద్ధి సంస్థ అని బోష్  పేర్కొంది.
జీఎస్టీ బిల్లు బిల్లు వల్ల భవిష్యత్తుల్లో కచ్చితంగా మేలు జరుగుతుందన్న బెర్న్స్ అమలుపై కొన్ని సందేహాలను వ్యక్తం చేశారు. . డీజిల్ వ్యవహారంలో ఆటో పరిశ్రమ  ఎదుర్కొంటున్న సంక్షోభం క్రమంలో తాము కూడా  అప్రతమత్తంగా ,ఆశావాదంతో కొనసాగుతున్నామన్నారు.

 

మరిన్ని వార్తలు