మరో వివాదంలో మంత్రి అజంఖాన్

30 Jun, 2016 14:37 IST|Sakshi
మరో వివాదంలో మంత్రి అజంఖాన్

రాంపూర్: సమాజ్వాదీ పార్టీ నేత,  పట్టణాభివృద్ధి శాఖ మంత్రి  అజంఖాన్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఓ అధికారిపై ఆయన చేయి చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. రాంపూర్ నియోజకవర్గంలో ఫ్లైఓవర్ నిర్మాణపు పనుల్లో జాప్యం జరుగుతోందంటూ అజంఖాన్ బుధవారం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ ఇంజనీర్ చెంపమీద కొట్టారు.

మరోవైపు అజంఖాన్ చర్యను నిరసిస్తూ ఇంజనీర్లు నిర్మాణపు పనులను నిలిపివేశారు. తక్షణమే మంత్రి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అప్పటివరకూ నిర్మాణపు పనులను చేపట్టేది లేదని స్పష్టం చేశారు. గతంలోనూ అజంఖాన్ పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు