కాస్ట్రో నిర్యాణంపై బి-టౌన్

12 Dec, 2016 15:16 IST|Sakshi
కాస్ట్రో నిర్యాణంపై బి-టౌన్

ముంబై:  క్యూబా విప్లవ యోధుడు, సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాట యోధుడు  ఫెడల్ కాస్ట్రో  మరణానికి నివాళులర్పిస్తూ బాలీవుడ్   స్పందించింది. దర్శకులు మధుర్ భండార్కర్,   హన్సల్ మెహతా, అశ్విన్ ముశ్రన్, నిఖిల్ అద్వాని వివేక్ అగ్నిహోత్రి, ఆయు ష్మాన్ ఖురాన్ తదితర ప్రముఖులు 90సం.రాల వయస్సులో అనారోగ్యంతో మరణించిన  కాస్ట్రోకి ట్విట్టర్ ద్వారా సంతాపం ప్రకటించారు.
ఆయనొక విప్లవ చిహ్నమని కొనియాడారు. ప్రపంచంలో ఉత్తమ, అత్యంత వివాదాస్పద నాయకులలో కాస్ట్రో  ఒకరని, అమెరికా చేసిన వందల హత్యాయత్నాలను తప్పించుకున్నా  అంతిమంగా అనారోగ్యంతో మరణించి సుదీర్ఘ నైతిక పోరాటాన్ని నిరూపించారన్నారు.
 ఫిడేల్ కాస్ట్రో మరణంతో క్యూబా చరిత్రలో ఒక ముఖ్యమైన శకం ముగింసింని మధుర్ భండార్కర్ ట్వీట్ చేశారు.  ప్రభావవంతమైన విప్లవాత్మక నాయకుడు కాస్ట్రో  అని అభివర్ణించారు.
కాగా కాస్ట్రో   మృతి పట్ల ప్రపంచ వ్యాప్తంగాసంతాప సందేశాలు వెల్లువెత్తాయి. దేశ ప్రధాని నరేంద్రమోదీ కూడా నివాళులర్పించారు.
,

మరిన్ని వార్తలు