వారి కోసం 'బాహుబలి' స్పెషల్ షో

25 Jul, 2015 11:24 IST|Sakshi
వారి కోసం 'బాహుబలి' స్పెషల్ షో

హైదరాబాద్ : బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న 'బాహుబలి' చిత్రాన్ని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దంపతులు తిలకించారు. దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని శుక్రవారం సాయంత్రం బంజారాహిల్స్లోని ప్రసాద్ ఫిలిం ల్యాబ్లో ప్రత్యేకంగా ప్రదర్శించిన ఈ సినిమాను గవర్నర్ నరసింహన్, ఆయన సతీమణి విమలా నరసింహన్తో పాటు కుటుంబ సభ్యులతో కలిసి చూశారు.

కాగా బాక్సాఫీస్ ను  షేక్ చేస్తున్న బాహుబలి సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన 'బాహుబలి' చిత్రం రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబడుతోంది.

మరిన్ని వార్తలు