‘భారత్ హిందువులది కాదు.. హిందుస్తానీలది!’

15 Oct, 2015 01:55 IST|Sakshi

న్యూఢిల్లీ: దాద్రి ఘటనను ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించాలని సాహిత్య అకాడెమీ అవార్డులను వెనక్కిచ్చిన రచయితలు బుధవారం డిమాండ్ చేశారు. ‘ఇక్కడ నివసించే హిందుస్తానీలందరిదీ ఈ దేశం. ఇది కేవలం హిందువుల దేశం కాదు. హిందుస్తానీలందరికీ రక్షణ కల్పించాలి. అన్ని మతాలను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది’ అని నయనతార సెహగల్ పేర్కొన్నారు. దాద్రి ఘటనపై ప్రధాని స్పందన చాలా పేలవంగా, బలహీనంగా ఉందని కన్నడ రచయిత శశి దేశ్‌పాండే వ్యాఖ్యానించారు.   

సాహిత్య అకాడెమీ అవార్డ్‌ను తిరిగిచ్చేస్తున్నట్లు బుధవారం కవి కేకే దారువాలా ప్రకటించారు. రాజకీయ కారణాలతోనే రచయితలు తమ పురస్కారాలను వెనక్కు ఇస్తున్నారని బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ విమర్శించారు. 1975లో దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు, ఏడాదిన్నర కిందట యూపీలోని ముజఫర్‌నగర్‌లో మత ఘర్షణలు చోటుచేసుకున్నప్పుడు రచయితలు నిరసనగళం ఎందుకు వినిపించలేదని ఢిల్లీలో విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు