బజాజ్‌ ఆటో డీలా: భారీ డివిడెండ్‌

18 May, 2017 15:21 IST|Sakshi

ముంబై: ఆటో రంగ దిగ్గజం బజాజ్‌ ఆటో లిమిటెడ్‌  గతేడాది  క్యూ4 ఫలితాల్లో  నిరాశపర్చింది.    విశ్లేషకుల అంచనాలను అధిగమించిలేని నికర లాభాలు భారీగా పడిపోయాయి.   క్యూ4 జనవరి-మార్చి  ఫలితాలను గురువారం  ప్రకటించింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో నికరలాభంలో 16 శాతం క్షీణించి  రూ .802 కోట్లు (124.50 మిలియన్ డాలర్లు)ను రిపోర్టు చేసింది.   గత ఏడాది క్వార్టర్‌ లో ఇది రూ. 949 కోట్లగా ఉంది. బీఎస్ -4 వాహనాలు,  ఇన్‌పుట్‌ ఖర్చులు  పెరగడం తదితర కారణాలను సంస్థ లాభాలను దెబ్బతీసాయి.  మార్చినాటి క్వార్టర్‌  ఆపరేషన్ల  ఆదాయం రూ.5210లు, మొత్తం ఆదాయం రూ.5710 లుసాధించినట్టు బజాజ్‌ ఆటో రెగ్యులేటరీ  ఫైలింగ్‌ లో తెలిపింది

మార్చినాటి క్వార్టర్‌  ఆపరేషన్ల  ఆదాయం రూ.5210లు, మొత్తం ఆదాయం రూ.5710 లుసాధించినట్టు బజాజ్‌ రెగ్యులేటరీ  ఫైలింగ్‌ లో తెలిపింది. నికర అమ్మకాలు సైతం 9 శాతం తగ్గి రూ. 5,213 కోట్లకు చేరాయి. నిర్వహణ లాభం(ఇబిటా) 21 శాతం తిరోగమించి రూ. 905 కోట్లు అయ్యింది.
మరోవైపు ప్రతి ఈక్విటీ షేరుకు రూ.55  డివిడెండ్‌ను బోర్డు ప్రతిపాదించింది.  ఫలితాల నేపథ్యంలో  ప్రస్తుతం బీఎస్ఈలో ఈ షేరు 2 శాతానికిపైగా క్షీణించింది.
 

 

మరిన్ని వార్తలు