డ్రంకన్ డ్రైవ్ లో దొరికిన టీవీ నటుడు

1 Jan, 2015 23:00 IST|Sakshi
డ్రంకన్ డ్రైవ్ లో దొరికిన టీవీ నటుడు

ముంబై: ప్రముఖ టీవీ నటుడు, 'బాలికా వధు' ఫేం సిద్దార్థ శుక్లా డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడ్డాడు. గురువారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో తాగి కారు నడుపుతూ అతడు ట్రాఫిక్ పోలీసులకు దొరికాడు. నూతన సంవత్సర వేడుకలకు హాట్ స్పాట్ అయిన జూహు బీచ్ వెళుతుండగా అతడిని పట్టుకున్నారు.

సిద్దార్థ శుక్లా ఒక్కడే కారు నడుపుకుంటూ వెళుతున్నాడని, ఆ సమయంలో అతడు మద్యం మత్తులో ఉన్నాడని పోలీసులు తెలిపారు. అతడిపై కేసు నమోదు చేసి రూ. 2000 జరిమానా విధించారు. అతడి డ్రైవింగ్ లైసెన్స్ ను డీఎన్ నగర్ ట్రాఫిక్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు