చెత్తకుండీలో బ్యాలెట్ పేపర్లు, వైఎస్సార్సీపీ ఆందోళన...

2 Aug, 2013 03:16 IST|Sakshi

వి.కోట, న్యూస్‌లైన్ : చిత్తూరు జిల్లా వి.కోట మండలం కృష్ణాపురం పంచాయతీకి సంబంధించిన బ్యాలెట్ పేపర్లు గురువారం చెత్తకుండీలో ప్రత్యక్షమయ్యాయి. దీంతో వైఎస్సార్‌సీపీ నేతలు ఆందోళనకు దిగారు. బుధవారం కృష్ణాపురం పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుతో లక్ష్మమ్మ పోటీచేశారు. కౌంటింగ్ సిబ్బంది నిర్లక్ష్యంవల్ల తమకు రావాల్సిన ఓట్లను సైతం చెల్లనివిగా పక్కన పడేశారని లక్ష్మమ్మ తరఫు ఏజెంట్లు ఆరోపించారు.
 
  దీనిపై అప్పుడే వారు ఆందోళనకు దిగారు. కౌంటింగ్ అనంతరం టీడీపీ మద్దతునిచ్చిన సరస్వతి గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో లక్ష్మమ్మ వుద్దతుదారులు రీకౌంటింగ్‌కు పట్టుబట్టారు.  అంగీకరించకుండా 91 ఓట్ల మెజారిటీతో సరస్వతి గెలిచినట్లు చెప్పారు. 113 ఓట్లు చెల్లనివిగా తేల్చారు. అయితే గురువారం పాఠశాల వద్ద చెత్తకుండీలో బ్యాలెట్ పేపర్లు ఉండడం స్థానికులు గవునించారు. తవు పార్టీ సానుభూతిపరురాలికి పడాల్సిన ఓట్లను అధికారులు, టీడీపీ నేతలు కలిసి చెల్లనివిగా ప్రకటించారని ఆరోపిస్తూ పలమనేరు మాజీ ఎమ్మె ల్యే, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త అమరనాథరెడ్డి నేతృత్వంలో నేతలు జాతీయు రహదారిపై బైఠారుుంచారు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని వారు చెప్పారు.

మరిన్ని వార్తలు