భారత్లో వ్యాపారానికి 'బెంగళూరు' అత్యుత్తమం

22 Oct, 2013 14:00 IST|Sakshi

భారతదేశంలో అత్యుత్తమ వ్యాపార కేంద్రంగా భారతీయ సిలికాన్ వ్యాలీ బెంగళూరు నగరం మొట్టమొదటి స్థానాన్ని ఆక్రమించిందని మంగళవారం ఓ సర్వే వెల్లడించింది. ఆ తర్వాత స్థానాలు వరుసగా చెన్నై, ముంబై, పుణే మహానగరాలు ఉన్నాయని చెప్పింది. అలాగే  చిన్న నగరాలైన ఇండోర్, భువనేశ్వర్, కోయంబత్తురులు వరుసగా 5,6,7స్థానాల్లో నిలిచాయని, వీటితోపాటు అహ్మదాబాద్ (8), నాగపూర్ (9), కొచ్చి (10) స్థానాలను ఆక్రమించాయని తెలిపింది.

 

అయితే దేశ రాజధాని న్యూఢిల్లీ నగరం మాత్రం ఆ జాబితాలో చోటు సంపాదించుకోలేక పోయింది. కాగా న్యూఢిల్లీ పరిసర ప్రాంతాల్లోని నొయిడా, గుర్గావ్లు మాత్రం జాబితాలో 17, 19 స్థానాల్లో ఉన్నాయని చెప్పింది. దేశ మొత్తం మీద 21 నగరాలు ఆ జాబితాలో చోటు సంపాదించాయని పేర్కొంది.

 

నగరంలోని ప్రజలు జీవన విధానం, నివాసం,  నగరం సంస్కృతి, ఇంధనం, నీరు, రవాణా, ఆరోగ్యం, వాతావరణం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని జాబితాను రూపొందించినట్లు సర్వే పేర్కొంది. గ్లోబల్ ఇన్షియేటివ్ ఫర్ రిస్ట్ర్రెక్చరిగ్ ఎన్విరాన్ మెంట్ అండ్ మేనేజ్మెంట్ (జీఐఆర్ఈఎమ్), డీటీజెడ్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన సర్వే నివేదికను మంగళవారం ఇక్కడ విడుదల చేశాయి.

మరిన్ని వార్తలు